Vijay Deverakonda Ranabaali: కెరీర్ లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకుంటూ అతి కష్టమైన పరిస్థితిని ఎదురుకుంటున్న హీరోల్లో ఒకడు విజయ్ దేవరకొండ(Vijay Devarakoda). అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత ఆ రేంజ్ సూపర్ హిట్స్ ని మాత్రం చూడలేదు. రీసెంట్ గా విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ రేంజ్ లోనే నిలబడడం గమనార్హం. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘రణబలి'(Ranabali Movie), ‘రౌడీ జనార్ధన’ అనే సినిమాలు చేస్తున్నాడు. ‘రౌడీ జనార్ధన’ చిత్రం టీజర్ కొద్దిరోజుల క్రితమే విడుదలై డివైడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కి ఆ గెటప్, డైలాగ్ డెలివరీ ఏ మాత్రం సూట్ అవ్వలేదంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇక నిన్న విడుదల చేసిన ‘రణబలి’ మూవీ గ్లింప్స్ వీడియో కి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
గ్లింప్స్ వీడియో మొత్తం చాలా బాగుంది. సినిమాని మంచి కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు అని కూడా అర్థం అవుతోంది, కానీ విజయ్ దేవరకొండ గెటప్, ఆయన పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ చాలా కామెడీ గా ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ కి ఎందుకు ఇలాంటి సినిమాలు, చక్కగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు నెటిజెన్స్. ఉదాహరణకు తమిళనాడు లో ప్రదీప్ రంగనాథన్ ని తీసుకోవచ్చు. వరుసగా ఆయన యూత్ ఫుల్ మూవీస్ చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన మార్కెట్ వేరే లెవెల్ కి చేరింది. ఆయన తదుపరి చిత్రానికి ఈసారి సూపర్ హిట్ టాక్ వస్తే 200 కోట్ల గ్రాస్ అవలీల గా వస్తుంది. విజయ్ దేవరకొండ కూడా ఆ రేంజ్ లో ఉండాల్సిన హీరో.
కానీ ఇప్పుడు ఆయనకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రావడం లేదు , ఇది నిజంగా శోచనీయం. ఆయన ఇమేజ్ కి తగ్గ సినిమాలు చేస్తే జనాలు థియేటర్స్ కి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదని విశ్లేషకుల వాదన. పైగా డైలాగ్ డెలివరీ విజయ్ దేవరకొండ కి ప్రతీ సినిమాలో అర్జున్ రెడ్డి మాడ్యులేషన్ లో ఉండడం కూడా చాలా పెద్ద మైనస్ అవుతోంది. సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ‘రణబలి’ లో కచ్చితంగా సీమ యాస ఉండాలి. కేవలం డైలాగ్ డెలివరీ మీదనే విజయ్ దేవరకొండ చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ చిత్రం లో కూడా తెలంగాణ యాస లో మాట్లాడితే సినిమా పోయినట్టే అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ తలరాత మారుస్తుందా లేదా అనేది.