Homeఅంతర్జాతీయంIndia EU trade agreement: భారత్‌ - ఈయూ వాణిజ్య ఒప్పందం.. చాలా వస్తువుల ధరలు...

India EU trade agreement: భారత్‌ – ఈయూ వాణిజ్య ఒప్పందం.. చాలా వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్‌

India EU trade agreement: భారత్‌–యురోపియన్‌ యూనియన్‌ మధ్య 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు పూర్తయింది. ప్రధాని నరేంద్రమోదీ ఈమేరకు చొరవ చూపారు. దీంతో జనవరి 26న అగ్రిమెంట్‌ పూర్తయింది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో ఈయూ నుంచి దిగుమతి అయ్యే వస్తువులలో 96.6 శాతానికి పైగా పన్నులు పూర్తిగా తొలగిస్తారు లేదా గణనీయంగా తగ్గిస్తారు. ఇది భారతీయ వినియోగదారులకు రోజువారీ ఖర్చుల్లో పెద్ద ఊరటను ఇస్తుంది. యూరప్‌లో తయారైన కార్లు (జెర్మన్, ఇటాలియన్‌ మోడల్స్‌) ధరలు 20–30% వరకు దిగవచ్చు. ఆలివ్‌ ఆయిల్, కివీ పండ్లు వంటి ఆహార పదార్థాలు, విస్కీ, వోడ్కా, బీర్, వైన్‌ లాంటి పానీయాలు, సిద్ధాంగా ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ ఐటెమ్స్, పండ్ల రసాలు అందరికీ చౌక అవుతాయి. ఇలాంటి మార్పు ద్వారా మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు తగ్గి, జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.

భారత ఎగుమతులకు గేట్‌వే
భారత్‌ ఎగుమతి చేసే వస్తువుల్లో 90 శాతానికిపైగా యూరోపియన్‌ మార్కెట్లలో సుంకాలు ఉండవు. టెక్స్‌టైల్స్‌ రంగం (కాటన్‌ గార్మెంట్స్, సారీలు, హ్యాండ్‌లూమ్‌) పెద్దగా ప్రయోజనం పొందుతుంది, ఇటలీ, ఫ్రాన్స్‌ మార్కెట్లలో డిమాండ్‌ పెరుగుతుంది. కెమికల్స్‌ (ఫార్మా ఇంటర్మీడియేట్స్, పెస్ట్‌సైడ్స్‌) రంగం జర్మనీ, బెల్జియం వర్క్‌షాప్‌లకు సులభ ప్రవేశం పొందుతుంది. ఆభరణాలు (గోల్డ్, డైమండ్‌ జ్యువెలరీ) స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ఎగుమతులు దాదాపు రెట్టింపు అవుతాయని అంచనా. ఇవి లక్షలాది ఉద్యోగాలు సృష్టించి, ఎంఎస్‌ఎంఈలకు బూస్ట్‌ ఇస్తాయి. మొత్తం వాణిజ్యం వృద్ధి చెంది, జీడీపీ 1 నుంచి 2 శాతం వృద్ధికి దోహదపడవచ్చు.

ఆర్థిక సహకారం బలోపేతం
ఈ ఒప్పందం రెండు ప్రాంతాల మధ్య పరస్పర పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. యూరప్‌ నుంచి టెక్నాలజీ, మెషినరీ దిగుమతులు పెరిగి, భారత పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. భారత్‌ నుంచి ఐటీ, ఆటో పార్ట్స్‌ ఎగుమతులు పెరిగి, సరఫరా బలపడుతుంది. అయితే, స్థానిక ఉత్పాదకులు పోటీకి సిద్ధంగా ఉండాలి. మొత్తంగా, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్‌ను గ్లోబల్‌ ట్రేడ్‌ హబ్‌గా మార్చి, మధ్య తరగతి ఆదాయాలను పెంచుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular