Indian DISCOM Performance : దేశ ఆర్థికాభివృద్ధిలో విద్యుత్ రంగం వెన్నెముక వంటిది. అయితే, గత దశాబ్ద కాలంగా భారతీయ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల జాతీయ స్థాయిలో కొంత మార్పు కనిపిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోని డిస్కంలు మాత్రం సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
దశాబ్దాల తర్వాత భారతీయ విద్యుత్ రంగంలో ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని డిస్కంలు మొత్తంగా ₹2,701 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.2013-14లో సుమారు ₹67,000 కోట్లుగా ఉన్న నష్టాలు, గత ఏడాదికి ₹25,000 కోట్లకు తగ్గి, ఇప్పుడు లాభాల బాట పట్టడం విశేషం. విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలు జాతీయ సగటు 15.04%కి తగ్గింది.
జాతీయ రేటింగ్స్‌లో తెలంగాణ డిస్కంలు గతంలో కొంత వెనుకబడ్డాయి. తెలంగాణ డిస్కంల సంచిత నష్టాలు సుమారు ₹59,000 కోట్లకు చేరాయి. విద్యుత్ కొనుగోలు బకాయిలు మరియు తీసుకున్న అప్పుల మీద చెల్లిస్తున్న వడ్డీలు సంస్థల ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి.యితే, 2024-25లో తెలంగాణ డిస్కంలు తమ నష్టాలను కొంతమేర తగ్గించుకున్నాయి. పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం రాష్ట్రంలో మూడవ డిస్కంను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది మరియు వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ డిస్కంలు ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరుచుకున్నాయి.14వ వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్‌లో ఏపీకి చెందిన CPDCL, SPDCL తమ గ్రేడ్‌ను ‘C’ నుండి ‘B’కి పెంచుకున్నాయి. ఏపీ డిస్కంల బిల్లుల వసూళ్ల సామర్థ్యం 99.26%కి పెరిగింది.సాంకేతిక , వాణిజ్య నష్టాలను ఏపీ డిస్కంలు 7.9%కి తగ్గించగలిగాయి, ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ.పనితీరు బాగున్నప్పటికీ, ఏపీ డిస్కంలు కూడా దాదాపు ₹1 లక్ష కోట్ల అప్పులతో మరియు వార్షికంగా ₹8,000–10,000 కోట్ల నష్టాలతో సతమతమవుతున్నాయి.
దేశంలో విద్యుత పంపిణీ సంస్థల పనితీరు ఎలావుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.