Allu Arjun Atlee Movie Updates: ‘పుష్ప 2’ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), తన తదుపరి చిత్రాన్ని అట్లీ తో చేస్తున్నానని ప్రకటించి అభిమానులందరినీ సర్ప్రైజ్ కి గురి చేసాడు. గత ఏడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో తో జరిగింది. ఆ వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ లో హాలీవుడ్ యాక్షన్ చిత్రం రాబోతుంది అంటూ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తులో లేపారు సోషల్ మీడియా లో అభిమానులు, నెటిజెన్స్. హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే స్పెషల్ వీడియో కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా అల్లు అర్జున్ కెరీర్ లో మరో వెయ్యి కోట్ల గ్రాస్ సినిమా రాబోతుంది అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలై 40 శాతం టాకీ పార్ట్ పూర్తి అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే సోషల్ మీడియా లో గత రెండు,మూడు రోజులుగా ఈ సినిమా గురించి జరుగుతున్న ఒక ప్రచారాన్ని చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ సినిమా కి సంబంధించి ఇప్పటి వరకు తీసిన ఔట్పుట్ పై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో సంతృప్తి గా లేదట. చాలా సన్నివేశాలు రీ షూటింగ్ చెయ్యాలని ఆదేశిస్తున్నట్టు సమాచారం. ఎదో ఒకటి రెండు సన్నివేశాలు రీ షూటింగ్ చేయమంటే ఏ డైరెక్టర్ ఇబ్బంది పడదు. కానీ 90 శాతం సన్నివేశాలు రీ షూటింగ్ చెయ్యాలని అడిగితే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. డైరెక్టర్ అట్లీ పరిస్థితి కూడా అదేనట. కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎలాంటి కదలిక లేదు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేసాడు.
ఈ సినిమా కోసం ఆయన 60 రోజుల డేట్స్ ని కూడా కేటాయించాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ చిత్రం మొదలు కానుంది. చూస్తుంటే అట్లీ తో మొదలు పెట్టిన సినిమా కంటే, లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమానే ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అట్లీ సినిమా కమర్షియల్ గా హిట్ అవుతుంది అనే నమ్మకం లేదు కాబట్టే అల్లు అర్జున్ ఇలా మరో టాప్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో ఆ చిత్రానికి సంబంధించిన టీం రెస్పాన్స్ ఇస్తే తప్ప తెలియదు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్స్ గా దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ చేస్తున్నారు. ఇక విలన్ క్యారెక్టర్ లో రష్మిక మందాన కనిపించబోతుంది టాక్.