Mana Shankara Varaprasad Garu 15 Days Collections: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాని ఆదరిస్తే ఎక్కడ దాకా తీసుకెళ్లారో చెప్పడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా నిల్చింది. గడిచిన మూడు రోజుల్లో ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో మూడు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా మేనియా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పడానికి. నిన్న రిపబ్లిక్ సందర్భంగా నేషనల్ హాలిడే అవ్వడం తో తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 3.14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దరిదాపుల్లో రీసెంట్ గా విడుదలైన ఏ సంక్రాంతి సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
ప్రాంతాల వారీగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 15 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి, ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి?, నిర్మాతలకు మిగిలిన లాభాలు ఎంత అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. తెలుగు రాష్ట్రాల నుండి రిటర్న్ జీఎస్టీ తో కలిపి ఈ చిత్రానికి 139 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 206 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 12 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా ఓవర్సీస్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సరైన థియేట్రికల్ రిలీజ్ ఇవ్వలేదని అభిమానుల నుండి వినిపిస్తున్న ఆరోపణ. ఆ కారణం చేత ఈ సినిమా చాలా వరకు నష్టపోయిందని, లేదంటే ఇంకా ఎక్కువ గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 171 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 279 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 122 కోట్ల రూపాయలకు జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద 49 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ ముగిసే సమయానికి కచ్చితంగా ఈ చిత్రం మరో 5 కోట్ల రూపాయిల లాభాలను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో లో గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఇప్పటికీ ఉన్నట్టే, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.




