Vetrimaaran: వెట్రి మారన్ తీసే సినిమాలు తెలుగు స్టార్ హీరోలకు సెట్ అవుతాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే వస్తుంది. మిగిలిన దర్శకులందరూ అండరేటెడ్ డైరెక్టర్లు గానే మిగిలిపోతున్నారు...

Written By: Gopi, Updated On : October 27, 2024 5:49 pm

Vetrimaaran(1)

Follow us on

Vetrimaaran: ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్లలో వెట్రి మారన్ ఒకరు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరినీ మెస్మరైజ్ చేశాడు. ప్రతి ఒక్క హీరో వెట్రి మారన్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈయన సినిమాలు రియాల్టీ కి చాలా దగ్గరగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ స్టోరీలను రాసుకొని సినిమాలు చేయడం ఆయనకు నచ్చదు. మన రెగ్యూలర్ జీవితంలో జరిగే కథలను తీసుకొని అందులో ఎమోషన్ ని ఆడ్ చేస్తూ దాని ద్వారా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే వెట్రి మారన్ తీసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి…ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు కూడా మీకు డైరెక్షన్ లో నటించాలని ఉంది అని అడిగిన ప్రశ్నకి వెట్రి మారన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని ఉందని చెప్పడం విశేషం… నిజానికి ఆయన సినిమాలు తమిళనాడు పరిసర ప్రాంతాలను ఉద్దేశించి ఉంటాయి. కాబట్టి వాటికి పాన్ ఇండియా స్కోప్ అయితే ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో పాన్ ఇండియా హీరోలుగా వెలుగుందుతున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులలో ఈయన సినిమా చేయగలడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక రీసెంట్ గా షారుఖ్ ఖాన్ కూడా వెట్రి మారన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళందరిని సాటిస్ఫై చేసే కథ తన దగ్గర ఉందా? ఒకవేళ ఉన్నా కూడా అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాను చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే ఈయన సినిమాలు భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా ధనుష్ తో చేసిన అసురన్ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ధనుష్ కి ‘నేషనల్ అవార్డు’ ని తీసుకొచ్చి పెట్టింది.

అందువల్లే వెట్రి మారన్ సినిమాలో నటిస్తే నటులు తమకంటూ ఒక సెపరేట్ గుర్తింపును క్రియేట్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే చాలామంది హీరోలు ఆయన డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చూడాలి మరి ఆయన తన తదుపరి సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తాడా? లేదా అనేది…