https://oktelugu.com/

Nag Ashwin: ఏకంగా 3 సినిమాల కలయిక..’కల్కి 2′ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నాగ అశ్విన్!

కేవలం రెండు మూడు సినిమాల అనుభవంతో నాగ అశ్విన్ హాలీవుడ్ తరహా స్టాండర్డ్స్ తో ఇలాంటి సినిమా ఎలా తియ్యగలిగాడు?, మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ జోడించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది?, ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు అనే అనుభూతి చూసే ప్రతీ ప్రేక్షకుడికి అనిపించింది. అందుకే ఈ సినిమా అన్ని భాషల్లోనూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 27, 2024 / 05:16 PM IST

    Nag Ashwin

    Follow us on

    Nag Ashwin: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో విజువల్ వండర్స్ తియ్యాలంటే రాజమౌళి, శంకర్ మాత్రమే తియ్యాలి, ఇక ఎవ్వరు తీసిన వర్కౌట్ అవ్వదు, వాళ్ళని మ్యాచ్ చేయడం ఎవరి తరం కాదు అనేది నిన్న మొన్నటి వరకు మనకి ప్రధానంగా వినిపించిన వార్త. కానీ న్యూ ఏజ్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరికంటే ప్రతిభావంతులు అని రీసెంట్ గా ఎన్నో ఉదాహరణలు మనకి తారసపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేసాడు అనే చెప్పాలి. కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో 400 కోట్ల రూపాయలతో సమానమైన క్వాలిటీ ని రాబట్టుకున్నాడు. ఇంత తక్కువ బడ్జెట్ తో, అంత క్వాలిటీ గా రాజమౌళి కూడా తెరకెక్కించలేడేమో. అలాగే ఇదే ఏడాదిలో విడుదలైన ప్రభాస్ ‘కల్కి’ చిత్రం కూడా మరో విజువల్ వండర్.

    కేవలం రెండు మూడు సినిమాల అనుభవంతో నాగ అశ్విన్ హాలీవుడ్ తరహా స్టాండర్డ్స్ తో ఇలాంటి సినిమా ఎలా తియ్యగలిగాడు?, మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ జోడించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది?, ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు అనే అనుభూతి చూసే ప్రతీ ప్రేక్షకుడికి అనిపించింది. అందుకే ఈ సినిమా అన్ని భాషల్లోనూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రాజమౌళి కి మాత్రమే సాధ్యం అని అనుకున్న వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్, కొత్తగా వచ్చిన డైరెక్టర్ కి కూడా సాధ్యపడింది. ఇదంతా పక్కన పెడితే ‘కల్కి 2’ కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కి సంబంధించి డైరెక్టర్ నాగ అశ్విన్ ‘అమరన్’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కొన్ని మాటలు అభిమానుల్లో ఇంకా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు ‘కల్కి 2’ గురించి అప్డేట్ ఇవ్వాల్సిందిగా బలంగా కోరుకుంటారు.

    అప్పుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి 2 ఇప్పుడే రాదు. చాలా సమయం పడుతుంది. కల్కి కంటే పది రెట్లు ఎక్కువ గ్రాండ్ గా ఆ చిత్రం ఉంటుంది. అది తెరకెక్కించేవరకు వేరే సినిమాకి షిఫ్ట్ అవ్వను. ఎందుకంటే కల్కి2 చిత్రం మూడు, నాలుగు సినిమాలతో సమానం’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ లో శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అమరన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి ఒక అతిథిగా విచ్చేసిన నాగ అశ్విన్ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ, ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు కల్కి 2 అప్డేట్ చెప్పుకొచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది.