https://oktelugu.com/

‘ఉప్పెన’ విరుచుకుపడుతుందా?

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు. అయితే ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్, ఒక కొత్త దర్శకుడు కలిసి చేస్తోన్న సినిమాకి, ఒక స్టార్ డమ్ ఉన్న సినిమాకి ఉన్నంత క్రేజ్ రావడం బహుశా ఈ సినిమాకే సాధ్యం అయింది అనుకుంటా. జనాల దృష్టిలో ఈ సినిమా హిట్ అయిపోయిందనే కలర్ వచ్చేసింది. ఎంత మెగాస్టార్ చిన్న మేనల్లుడు అయినా, వైష్ణవ్ తేజ్ కి ఫ్యాన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : February 9, 2021 / 10:02 AM IST
    Follow us on


    మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు. అయితే ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్, ఒక కొత్త దర్శకుడు కలిసి చేస్తోన్న సినిమాకి, ఒక స్టార్ డమ్ ఉన్న సినిమాకి ఉన్నంత క్రేజ్ రావడం బహుశా ఈ సినిమాకే సాధ్యం అయింది అనుకుంటా. జనాల దృష్టిలో ఈ సినిమా హిట్ అయిపోయిందనే కలర్ వచ్చేసింది. ఎంత మెగాస్టార్ చిన్న మేనల్లుడు అయినా, వైష్ణవ్ తేజ్ కి ఫ్యాన్స్ ఏమి లేరు, అలాగే కృతి శెట్టి అనే కొత్తమ్మాయి ఎవరో కూడా తెలియదు. కానీ, ఇప్పటికి వీరికి అభిమానులు క్రియేట్ అయిపోయారు. అంతగా ఈ సినిమా సాంగ్ లు, ప్రోమోలు జనంలోకి వెళ్లాయి.

    Also Read: మహేష్ బాబును రాజమౌళి ఎలా చూపించబోతున్నాడో తెలుసా?

    అయితే భారీగా పెరిగిపోయిన అంచనాలను ఉప్పెన అందుకోవాలంటే .. సినిమా అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా లేకపోతే సినిమా జనానికి బోర్ కొట్టేస్తోంది. ఎక్కువ అంచనాలతో థియేటర్లకు ప్రేక్షకులు వస్తే.. అది ఆ సినిమాకే నష్టం. ఈ విషయంలో ఉప్పెన బుక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు. సినిమా ఏమాత్రం తక్కువగా ఉన్నా ప్రేక్షకులు పెదవి విరుస్తారు. మరి ‘ఉప్పెన’ వారిని ఎలా మురిపిస్తుందో? ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

    Also Read: ఉప్పెన క్లైమాక్స్ లీక్.. ఇదేనట?

    ఇక సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే సరికి ఈ సినిమా పై తమిళంలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాయింట్ కి వస్తే డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. కొట్టి భయపెట్టినా తన ప్రేమను వదిలిపెట్టట్లేదని ఏకంగా ఆ హీరో మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారని.. ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్