https://oktelugu.com/

ఆ ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా.. 2.30 లక్షలు నష్టపోయే ఛాన్స్..?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ను తెరిచే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ అంటే మినిమమ్ బ్యాలెన్స్ కచ్చితంగా బ్యాంక్ ఖాతాలో ఉంచాలి. అయితే జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాకు మినిమం బ్యాలన్స్ నిబంధనలు వర్తించవు. ఈ ఖాతాపై ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 9, 2021 / 09:54 AM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ను తెరిచే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ అంటే మినిమమ్ బ్యాలెన్స్ కచ్చితంగా బ్యాంక్ ఖాతాలో ఉంచాలి. అయితే జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాకు మినిమం బ్యాలన్స్ నిబంధనలు వర్తించవు. ఈ ఖాతాపై ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

    Also Read: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1,300 చెల్లిస్తే లక్షల్లో రాబడి..?

    జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటే ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ, చెక్ బుక్ తో పాటు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లాంటి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ మంది జన్ ధన్ యోజన ఖాతాలను కలిగి ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జన్ ధన్ యోజన స్కీమ్ ను అమలు చేస్తున్నారు.

    Also Read: ఉద్యోగులకు హెచ్‌సీఎల్ శుభవార్త.. రూ. 700 కోట్ల స్పెషల్ బోనస్..?

    డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు సహాయంతో జన్ ధన్ యోజన అకౌంట్ ను తెరిచే అవకాశం ఉంటుంది. అయితే ఈ అకౌంట్ ను తీసుకోవడం ద్వారా 2.30 లక్షల రూపాయల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. జన్ ధన్ యోజన అకౌంట్ ను కలిగి ఉన్నవారికి రెండు లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ లభించడంతో పాటు 30,000 రూపాయల బీమా కవరేజ్ లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అయితే జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డ్ లింక్ చేస్తే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్న వారికి 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను కలిగి ఉండి ఆధార్ కార్డును లింక్ చేసుకోని వారు మార్చి 31వ తేదీలోపు ఆధార్ కార్డును లింక్ చేసుకుంటే మంచిది.