ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఓటు వేసేవాళ్లకు ఇప్పటికే ఓటర్ స్లిప్ లు అందాయి. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ స్లిప్ అందకపోవడం వల్ల ఓటు వేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు ఓటర్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే ఓటర్ స్లిప్ రాకపోయినా కంగారు పడకుండా సులభంగా మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
Also Read: ఆ ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా.. 2.30 లక్షలు నష్టపోయే ఛాన్స్..?
డిజిటల్ ఓటర్ ఐడీని డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకునేవాళ్లు మొదట voterslipulb.apec.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటర్ ఐడీని డౌన్ లోడ్ చేసుకోవఛు. వెబ్ సైట్ లోకి వెళ్లిన తరువాత జిల్లా, అర్బన్/లోకల్ బాడీ అనే సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ లో వార్డ్ నంబర్ ను సెలక్ట్ చేసుకుని ఓటర్ ఐడీ నంబర్ సెర్చ్ చేసి ఆ ఓటర్ స్లిప్ ను ప్రింట్ తీసుకుని ఓటు హక్కు కోసం వినియోగించుకునే ఛాన్స్ ఉంది.
Also Read: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1,300 చెల్లిస్తే లక్షల్లో రాబడి..?
searchvoterslipulb.apec.gov.in లింక్ సహాయంతో కూడా ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. electoralsearch.in అనే వెబ్ సైట్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ అనే వివరాలను పొందే అవకాశం ఉంటుంది. పీడీఎఫ్ ఫార్మట్ లో డౌన్ లోడ్ అయిన ఓటర్ స్లిప్ ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారు సైతం ఓటర్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఓటర్ ఐడీ తెలియకపోతే పేరును సెర్చ్ చేసి ఓటర్ స్లిప్ ను పొందవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
e-epic ను ఫామ్ 6 రెఫెరెన్స్ నంబర్ ను ఉపయోగించి కూడా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డౌన్ లోడ్ చేసిన ఓటర్ స్లిప్ సహాయంతో ఓటు వేసే అవకాశం ఉంటుంది.