Animal: యానిమల్ మూవీలో ఆల్ఫామేల్.. మరి ఆల్ఫా ఫిమేల్స్ ఉంటారా? వారి లక్షణాలేంటి?

ఆల్ఫా మేల్ తరహాలోనే ఆల్ఫా ఫిమేల్ కూడా ఉంటారట. అంతేకాదు వారి లక్షణాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి వారిని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని అని తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : December 27, 2023 6:21 pm

Animal Collection

Follow us on

Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం విడుదల అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఆల్ఫా మేల్, ఆల్ఫా ఫిమేల్స్ గురించే చర్చ జరుగుతుంది. అయితే ఆల్ఫా ఫిమేల్ గురించి చాలా మందికి తెలియదనే చెప్పుకోవచ్చు. ఇందుకు కారణం అమ్మాయిలు సున్నితంగా ఉండటంతో పాటు బాగా సెన్సిటివ్ గా ఉంటారని అందరి భావన.

ఆల్ఫా మేల్ తరహాలోనే ఆల్ఫా ఫిమేల్ కూడా ఉంటారట. అంతేకాదు వారి లక్షణాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి వారిని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని అని తెలుస్తోంది. అంతేకాదు మన చుట్టూ కూడా ఆల్ఫా ఫిమేల్ ఎవరో ఒకరు ఉంటే ఉంటారు. వారి చేతల్లో అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ విధంగా ఎవరూ ఆలోచించి ఉండకపోయి ఉండవచ్చు. ఆల్ఫా స్త్రీలు తమ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. తమకు ఏదైనా కావాలనుకుంటే కష్టపడి సాధించుకుంటారు.

ఇంటి బాధ్యతలు అయినా, ఉద్యోగ రంగంలో అయినా ధైర్యంగా రాణిస్తారు. తనని తాను ప్రమోట్ చేసుకుంటూ తనకేం కావాలో నిర్ణయించుకోగలరు. అందుకు తగ్గట్టుగానే దాన్ని సంపాదించుకోగలరు. ఆల్ఫా స్త్రీలు ఎలాంటి రిస్క్ ను అయినా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. దాని వలన ప్రమాదాలు వస్తాయని ముందే తెలిసినా వెనకడుగు వేయరు. అలాగే వారు ఒంటరిగా ఉన్నామనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఆ కారణంగా ఎటువంటి రిలేషన్ షిప్ లోకి వెళ్లరట. అలాగే వారిని ఏ విధంగానూ ఆపలేం.నిరుత్సాహపర్చలేం. అందుకే ఆల్ఫా ఫిమేల్ విజయాన్ని కచ్చితంగా సాధించి తీరుతారు. అంతేకాదు ఏదో కష్టం వచ్చిందని తమ నిర్ణయాలను మార్చుకోరు. ముందుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఈ విధంగానే చాలా విషయాల్లో ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు. అనుకున్నది సాధించడంతో పాటు వ్యక్తిత్వంతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి వారు చాలా అరుదుగా దొరుకుతారని మాత్రం చెప్పుకోవచ్చు. ఆల్ఫా ఫిమేల్స్ కఠినంగా కనిపించినప్పటికీ వారిలోనూ లాయల్ గా ఉండే ఫ్రెండ్ కూడా ఉండటం విశేషం.