https://oktelugu.com/

Janhvi Kapoor: టైట్ డ్రెస్ లో నీళ్లలో తడుస్తూ కుర్రాళ్లకు చలి పుట్టించిన జాన్వీ… సెన్సేషనల్ ఫోటోలు వైరల్!

జాన్వీ కపూర్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ దేవర. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న దేవర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. జాన్వీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది.

Written By: , Updated On : December 27, 2023 / 06:17 PM IST
Janhvi Kapoor

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: ఇప్పటి వరకు జాన్వీ కపూర్ కి ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది లేదు. అయినా ఆమెకు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె శ్రీదేవి కూతురు కావడం ఒక కారణం. అంతకు మించి సోషల్ మీడియా ద్వారా ఆమె ఫేమ్ రాబట్టారు. ఇంస్టాగ్రామ్ వేదికగా జాన్వీ కపూర్ గ్లామర్ షో కుర్రాళ్లకు ట్రీట్. తరచుగా ఆమె గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు. జాన్వీ కపూర్ ని ఇంస్టాగ్రామ్ లో 22 మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు.

ఆ రేంజ్ గ్లామర్ ఆమె సొంతం. బిగువైన పరువాలు ఎరవేస్తూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా రెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. సదరు డ్రెస్ లో చూపు తిప్పుకోలేని ఆమె అందం నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. దాంతో క్రేజీ కామెంట్స్ తో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కపూర్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ దేవర. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న దేవర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. జాన్వీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. జాన్వీ అణకువతో కూడిన విలేజ్ గర్ల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. లంగా ఓణీలో ఆమె ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. కథలో జాన్వీ రోల్ కీలకమని దర్శకుడు కొరటాల చెప్పారు.

డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత కళ్యాణ్ రామ్ దేవర అప్డేట్ ఇచ్చాడు. 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. మీరు ఊహించని విజువల్ వండర్ గా దేవర ఉంటుంది. షూటింగ్ కి చాలా కష్టపడ్డాము. ఓ సీన్ కోసం భారీ గొయ్యి తవ్వాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక దేవర ఫస్ట్ గ్లిమ్ప్స్ జనవరిలో విడుదల కానుందట.

ఎప్పుడో దశాబ్దాల క్రితం జాన్వీ తల్లి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. బ్లాక్ బస్టర్స్ కొట్టారు. వారి వారసులు నటిస్తున్న దేవరపై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. దేవర 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.