Big Boss Shivaji: యాక్టర్ శివాజీ ఒకపుడు పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి గరుడ పురాణం అంటూ నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. తాజాగా బిగ్ బాస్ షో ద్వారా చాలా వరకు అదంతా పోగొట్టుకున్నాడు. మంచి పాజిటివిటీ తో బయటకు వచ్చాడు. కాగా బిగ్ బాస్ షో తో క్రేజ్ తెచ్చుకున్న హీరో శివాజీ .. జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నాడు, అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ వీర విధేయుడిగా పని చేసిన శివాజీ. ఆ పార్టీ గెలవకపోవడంతో కనిపించకుండా పోయాడు.
హీరోగా మంచి పేరు సంపాదించిన శివాజీ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి జీరోగా మిగిలిపోయాడు. అయితే బిగ్ బాస్ షో లో పాల్గొని తనపై ఉన్న నెగిటివిటీ ని చాలా వరకు తగ్గించుకున్నాడు. శివాజీ హౌస్ లో కి వచ్చిందే జనాల్లోకి వెళ్లాలని అని .. దాని వెనుక రాజకీయ ప్లాన్ ఉందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్లు సమాచారం. టీడీపీ – జనసేన పొత్తు లో భాగంగా శివాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
నరసరావుపేట, వినుకొండ ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదొక నియోజకవర్గం నుంచి శివాజీ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. నరసారావుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, చిలకలూరిపేట ఇవన్నీ జనరల్ స్థానాలే కాబట్టి, శివాజీని ఈ స్థానాల్లో ఏదో ఒక చోట బరిలోకి దింపే అవకాశం ఉందట. అయితే శివాజీ మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తుంది.
ఆయన ఆసక్తి చూపించినా టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆపరేషన్ గరుడా అంటూ హడావిడి చేసిన శివాజీ .. టీడీపీ ఘోర పరాజయం కావడంతో రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవల బిగ్ బాస్ షోతో మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో శివాజీ పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినా .. టీడీపీ – జనసేన పార్టీలకు ఇప్పటివరకు పని చేసిన వాళ్ళని పక్కనపెట్టి శివాజీకి టికెట్ ఇస్తారా అంటే కష్టమే అని చెప్పవచ్చు. శివాజీ మాత్రం రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన తరుపున ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది.