Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలు కూడా విపరీతమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ జనసేన పార్టీ ని కాదని వైసిపి పార్టీ తరపున ప్రచారం నిర్వహించడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారి తీసింది. నిజానికి ఎన్ని గొడవలు ఉన్న ఫైనల్ గా మన ఫ్యామిలీలో ఉన్న అతనికే మనం సపోర్ట్ చేసుకుంటాం. సరే ఒకవేళ మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ల కి మనం సపోర్ట్ చేయకపోయిన కూడా పక్క వాళ్లకి మాత్రం సపోర్ట్ చేయడానికి మనం ముందుకు రాలేము.
మరి ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ లాంటి హీరో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అని తెలిసిన కూడా వైసీపీ క్యాండెట్ తరుపున తన ప్రచారాన్ని నిర్వహించడం వల్ల ఆయన చాలా వరకు కాంట్రవర్సీ లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి హీరో అభిమానులు కానీ, మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ తనకు యాంటీగా మారిపోయారు. ఇంకా పుష్ప 2 సినిమా కనక రిలీజ్ అయితే మాత్రం ఆ సినిమా మీద దారుణమైన నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ సినిమాని డిసెంబర్ ఆరోవ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: Nagarjuna: తన అభిమానికి క్షమాపణలు చెప్పిన నాగార్జున.. కారణం ఏంటంటే..?
ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమా కోసం బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి ‘నేషనల్ అవార్డు’ కూడా ఇచ్చారు. ఆయనకి నేషనల్ అవార్డు ఎందుకిచ్చారు అనే దానిమీద కూడా చాలామంది చాలా రకాల అభిప్రాయాలను అయితే తెలియజేశారు. నిజానికి పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ ఎర్రచందనం చెట్లను నరుకుతూ వాటిని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు.
Also Read: Kalki Movie: ప్రభాస్ కల్కికి బాలీవుడ్ లో నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తుంది ఎవరు..?
మరి ఇలాంటి ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం అల్లు అర్జున్ ను టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రంగస్థలంలో రామ్ చరణ్ క్యారెక్టర్ తో గాని అతని నటనతో గాని పోలిస్తే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నథింగ్ అనే చెప్పాలి. కాబట్టి రామ్ చరణ్ ను వదిలిపెట్టి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఆయనకి ఇచ్చారు అనే దానిమీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి…