Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను తీసి తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన సినిమాల్లో గీతాంజలి సినిమా అతనికి రొమాంటిక్ హీరోగా చాలా మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా గా కూడా నిలిచింది.
ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత తను అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ముఖ్యంగా నిన్నే పెళ్ళాడుతా లాంటి ఫ్యామిలీ సబ్జెక్టుని చేసిన తర్వాత ఆయన అన్నమయ్య లాంటి ఒక డిఫరెంట్ చిత్రంలో నటించి మెప్పించడం అనేది మనం చూశాం. ఇక వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేయడం లో నాగార్జున మిగతా హీరోల కంటే కొంతవరకు ముందు వరుసలో ఉంటాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read: Nagarjuna: నాగార్జున పక్కనే ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడొక స్టార్ హీరో అనే విషయం మీకు తెలుసా..?
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో తన అభిమాని ఒకతను ఆయనతో ఫోటో దిగడానికి ప్రయత్నం చేశాడు. ఇక దాంతో అక్కడి సిబ్బంది అతన్ని ఈడ్చి పక్కన పడేశారు. దాంతో అతను కింద కూడా పడబోయాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో నాగార్జున మీద నెటిజన్లు తీవ్రమైన విమర్శలైతే చేశారు. ఇక ఇది నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన రీసెంట్ గా ఈ విషయం పైన స్పందిస్తూ ‘ఈ విషయం ఇప్పుడే నా దాకా వచ్చింది. నాతో ఫోటో దిగడానికి వచ్చిన వ్యక్తి కి అలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ వ్యక్తి ని నేను క్షమాపణ కోరుతున్నాను.
ఇక మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను’ అని నాగార్జున ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక దాంతో నాగార్జున పైన విమర్శలు చేసే వాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపేసారు. ఇక నిజానికి ఎయిర్ పోర్ట్ లో కొంత మంది హీరోలతో ఫోటోలు దిగడానికి చాలామంది వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక అందులో కొందరు హీరోలు ఫోటోలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మరికొందరు మాత్రం కసురుకుంటూ ఉంటారు…