https://oktelugu.com/

BGT 2024: పెర్త్ లో సెంచరీ మాత్రమే కాదు.. యశస్వి అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.. ఇంతకీ అవి ఏంటంటే..

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఆస్ట్రేలియా పై భారీ లీడ్ సాధించింది. మూడవరోజు కూడా ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పటికీ 69 పరుగులు పూర్తి చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 24, 2024 / 03:14 PM IST

    BGT 2024(3)

    Follow us on

    BGT 2024: రిషబ్ పంత్ (1), ధృవ్ జురెల్(1) నిరాశపరచినప్పటికీ.. దూకుడుగా ఆడే క్రమంలో వాషింగ్టన్ సుందర్ (29) అవుట్ అయినప్పటికీ.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (7), విరాట్ కోహ్లీ(69) క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా అంటే విరుచుకు పడిపోయే విరాట్ ఇన్నింగ్స్ లో నిరాశపరిచినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం తన పూర్వపు లయను అందుకున్నాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యశస్వి జైస్వాల్ గురించి.. రెండవ రోజు ఆట 90 పరుగులతో క్రీజ్ లో ఉన్న అతడు.. మూడోరోజు మరో 71 పరుగులు జోడించాడు.. మొత్తంగా ఆస్ట్రేలియా తొలి సెంచరీ సాధించాడు. 161 పరుగులు సాధించి మిచెల్ మార్ష్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. తొలి వికెట్ కు కేఎల్ రాహుల్(77) తో 201 పరుగులు జోడించాడు. రాహుల్ అవుట్ అయినప్పటికీ.. యశస్వి తన జోరు కొనసాగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వాస్తవానికి అతడు జోరు చూస్తే డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ మార్ష్ బౌలింగ్ లో అకస్మాత్తుగా అవుట్ అయ్యాడు.

    రికార్డులు బద్దలు కొట్టాడు

    ఆస్ట్రేలియాలో తొలి సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.. 2001 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ పర్యాటక జట్టు బాటర్ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న ఘనతను యశస్వి సొంతం చేసుకున్నాడు. 2003లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు రాహుల్ ద్రావిడ్ సిక్స్ కొట్టి తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2009లో వాకా మైదానంలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా ఇదే తీరుగా తన సెంచరీ చేశాడు. ఇక ప్రస్తుతం 2024లో పెర్త్ వేదికగా యశస్వి జైస్వాల్ సిక్స్ కొట్టి సెంచరీ సాధించాడు.

    సునీల్ గావస్కర్ తర్వాత..

    ఇక ఈ సెంచరీ ద్వారా యశస్వి మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. బ్రిస్బెన్ వేదికగా 1968లో ఎమ్మెల్యే సింహ తన తొలి సెంచరీ చేశాడు. ఇదే మైదానం వేదికగా 1977లో సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. ఇక యశస్వి జైస్వాల్ కూడా తన ఆరంగేట్ర బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. జయసింహ, సునీల్ గవాస్కర్, జైస్వాల్ తమ రెండవ ఇన్నింగ్స్ ల లోనే ఈ ఘనతను సాధించడం గమనార్హం. అయితే జైస్వాల్ ఈ స్థాయిలో ఆడటంతో టీమిండియా ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది. ఇప్పటికే 400కు పై చిలుకు పరుగుల లీడ్ లో కొనసాగుతోంది