Chandu Mondeti , Suriya
Chandu Mondeti and Suriya : సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది…వాళ్ళు తలుచుకుంటే మామూలు నటులను సైతం స్టార్ హీరోలుగా మారుస్తారు. వాళ్ళు చేసిన సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంటారు…వాళ్ళను ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒంటి చేత్తో 24 క్రాఫ్ట్ లను హ్యాండిల్ చేయగలిగే ఏకైక వ్యక్తి డైరెక్టర్…అందుకే ఒక సినిమా కోసం దర్శకుడు పడే వేదన అంత ఇంత కాదు…
రీసెంట్ గా తండేల్ (Thandel) సినిమాతో మంచి విజయాన్ని సాధించిన చందు మొండేటి (Chandu Mondeti) ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో సూర్య తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడని కూడా వార్తలయితే వస్తున్నాయి మరి ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ సంపాదించుకోవడంలో ‘చందు మొండేటి ‘ లాంటి దర్శకుడు కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. కాబట్టి సూర్యతో చేస్తున్న సినిమా 300 ఏళ్ల నాటి కథతో వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ నిర్మిస్తుండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో సూర్య ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనేది వాస్తవం… ఇక చందు లాంటి దర్శకుడు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు. ఇక ఇది కూడా థ్రిల్లర్ సినిమాగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా చందు లాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
ఇక సూర్య లాంటి హీరోతో సినిమా అంటే ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తమిళ్ లో మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక హిందీలో కూడా ఇప్పుడిప్పుడే మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈయనతో సినిమా చేయడానికి యావత్తు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో చందు మొండేటి కి గొప్ప అవకాశమైతే వచ్చింది. మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన భారీ సక్సెస్ ని కట్టబెట్టే విధంగా సినిమాని తెరకెక్కిస్తాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… ఇక సూర్య చందు కాంబినేషన్ ఫిక్స్ అయినట్టుగా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అనౌన్స్ మెంట్ అయితే రాబోతుందట.
ఇక ఏది ఏమైనా కూడా సూర్య లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ఆయన నటించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయనతో ఎక్స్పరిమెంట్లు చేస్తే ఈజీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో చందు మొండేటి ఈ కథను ఎంచుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…