https://oktelugu.com/

Devara : చిక్కుల్లో పడ్డ ఎన్టీఆర్ ‘దేవర’..నెట్ ఫ్లిక్స్ లో రీచ్ కొంప ముంచిందా..? నిర్మాతకు కోట్ల రూపాయలలో నష్టం!

#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) హీరో గా నటించిన 'దేవర'(Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద సూపర్ హిట్ గా నిల్చింది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By: , Updated On : February 18, 2025 / 05:23 PM IST
Devara

Devara

Follow us on

Devara : #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) హీరో గా నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద సూపర్ హిట్ గా నిల్చింది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రారంభ షోస్ నుండి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత పాజిటివ్ టాక్ గా మారి, ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ లాంగ్ రన్ ని దక్కించుకున్న సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు, ఓటీటీ లో కూడా ఈ సినిమా ఒక సెన్సేషన్. నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. #RRR తర్వాత ఎన్టీఆర్ కి వచ్చిన గ్లోబల్ రీచ్ ని చూసి నమ్మకం తో ఈ రేంజ్ రేట్స్ పెట్టి కొనుగోలు చేసారు.

వాళ్ళ నమ్మకాన్ని నిజం చేసి చూపించింది దేవర చిత్రం. దాదాపుగా 9 వారాల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయిన ఈ సినిమాకి దాదాపుగా 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హాలీవుడ్ సినిమాలకు కాకుండా, గత ఏడాది ఆ స్థాయి వ్యూస్ ని రాబట్టుకున్న సినిమాగా ‘దేవర’ నిల్చింది. ఆ తర్వాత ఈ రికార్డుని ‘లక్కీ భాస్కర్’ చిత్రం అధిగమించింది. ఇప్పటికీ ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన గ్లోబల్ రీచ్ ‘దేవర’ చిత్రానికి శాపంగా మారిందా..?, సాటిలైట్ రైట్స్ పై ఆ ప్రభావం బలంగా పడిందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ఏ టీవీ ఛానల్ కి అమ్ముడుపోలేదట.

కారణం నిర్మాతలు ఆశించిన రేట్స్ ఇవ్వడానికి టీవీ చానెల్స్ ఆసక్తి చూపకపోవడం వల్లే. ఓటీటీ బాగా వృద్ధి లోకి వచ్చిన తర్వాత టీవీ లో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 10 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తే, ఇప్పుడు కనీసం 5 రేటింగ్స్ ని దక్కించుకోవడం గగనం అయిపోయింది. అందుకే డిజిటల్ మీడియా లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ చిత్రానికి సాటిలైట్ రైట్స్ మాత్రం అమ్ముడుపోవడం లేదు. నిర్మాతలు అడిగినంత రేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు టీవీ ఛానల్ యజమానులు. ప్రభాస్(Rebel Star Prabhas) కల్కి(Kalki 2898 AD) చిత్రానికి కూడా ఇలాంటి సమస్యనే ఎదురైంది. దీంతో మేకర్స్ కాస్త ఒక అడుగు కిందకి దిగి, జీ తెలుగు సంస్థ కి సాటిలైట్ రైట్స్ ని అమ్మేశారు. ఇప్పుడు ‘దేవర’ చిత్రానికి కూడా నిర్మాతలు దిగొస్తారా?, లేదా టీవీ చానెల్స్ దిగొస్తాయా అనేది తెలియాల్సి ఉంది.