https://oktelugu.com/

Manchu Manoj and CM Chandrababu Naidu : ‘సీఎం చంద్రబాబు కి వేరే పని లేదా’ అంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..వైరల్ అవుతున్న ఫోన్ కాల్ సంభాషణ!

నిన్న అర్థ రాత్రి మంచు మనోజ్(Manchu Manoj) ని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి బకరాపేట పోలీస్ స్టేషన్ కి తరలించిన ఘటన మీడియా లో సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : February 18, 2025 / 05:15 PM IST
Manchu Manoj , CM Chandrababu

Manchu Manoj , CM Chandrababu

Follow us on

Manchu Manoj and CM Chandrababu Naidu : నిన్న అర్థ రాత్రి మంచు మనోజ్(Manchu Manoj) ని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి బకరాపేట పోలీస్ స్టేషన్ కి తరలించిన ఘటన మీడియా లో సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే. చంద్రగిరి లో జరిగిన జల్లికట్టు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచి మనోజ్, ఆ తర్వాత ఆయన సమీపంలో ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ‘లేక్ వ్యాలీ రిసార్ట్'(Lake Valley Resort) లో బస చేసాడు. ఆరోజు రాత్రి సరిగ్గా 11 గంటలకు పెట్రోలింగ్ కి వచ్చిన పోలీసులు మంచు మనోజ్ రిసార్ట్ లో ఉన్నాడనే విషయం తెలుసుకొని అతని వద్దకు వెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఉండరాదని, దయచేసి ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. దీంతో మనోజ్ కి పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరగడంతో, మనోజ్ ని బకరాపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత మనోజ్ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్న సంభాషణ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముందుగా ఆయన మాట్లాడుతూ ‘మీ పోలీసులు సీఎం చంద్రబాబు(Cm Chandrababu Naidu) గారు అరెస్ట్ చేయమంటే వచ్చి చేశాము అన్నట్టుగా చెప్తున్నారు. సీఎం గారికి వేరే పనేమీ లేదా సార్..?, ఇలాంటి చిన్న చిన్న పంచాయితీలకు సీఎం స్థాయి వ్యక్తి దిగొస్తాడా?, ఇలాంటి వాటికి ఆయన పేరుని ఎందుకు వాడుకుంటున్నారు’ అంటూ నిలదీసాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇదంతా ఎవరు చేయిస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకెందుకు సార్ దాగుడుమూతలు. నేను పోలీస్ జీప్ ఎక్కుతుంటే మీ SI , ఒక కానిస్టేబుల్ నా చెయ్యి పట్టుకొని లాగారు. వాళ్ళు అలా నా చెయ్యి పట్టుకొని లాగాల్సిన అవసరం ఏముంది సార్, నేనేమి తప్పు చేశాను’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

‘మీరు నా చెయ్యి పట్టుకొని లాగిన ఆ SI ని, కానిస్టేబుల్ ని నా ముందుకు తీసుకొని రావాల్సిందే. అప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను. ఇక్కడి నుండి కధలను. అవసరమైతే రోడ్డు మీదకు వెళ్లి కూర్చుంటా. సమయం గడిచే కొద్దీ జనాలు పెరుగుతూనే ఉంటారు, మీడియా ప్రెస్ కూడా వచ్చేస్తుంది జాగ్రత్త, మీ ఇష్టం’ అంటూ ఆయన జరిపిన ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. సుమారుగా 5 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ ఫోన్ కాల్ సంభాషణని మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. పోలీస్ స్టేషన్ కి మనోజ్ ని తీసుకెళ్లడం ఎందుకు, ఆ తర్వాత వెంటనే ఆయన్ని వెళ్లిపొమ్మని పెద్ద అధికారులు చెప్పడం ఎందుకు?, ఇదంతా మోహన్ బాబు తన పలుకుబడిని ఉపయోగించుకొని చేస్తున్నాడా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.