కరోనా క్రైసిస్ నుంచి చిత్ర పరిశ్రమ కోలుకునేదెన్నడూ?

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా.. అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమ కరోనా క్రైసిస్ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. దీంతో ఈ రంగంపై ఆధారపడి లక్షలాది మంది కార్మికుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. Also Read: ఇండస్ట్రీలో కలకలం: మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడు? కరోనా ఎఫెక్టుతో గత […]

Written By: NARESH, Updated On : November 19, 2020 2:51 pm
Follow us on

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా.. అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమ కరోనా క్రైసిస్ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. దీంతో ఈ రంగంపై ఆధారపడి లక్షలాది మంది కార్మికుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది.

Also Read: ఇండస్ట్రీలో కలకలం: మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడు?

కరోనా ఎఫెక్టుతో గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడగా సినిమా షూటింగులు నిలిచాయి. ఇప్పడిప్పుడే షూటింగులు మొదలైనా నిర్మాతలు.. దర్శకులు.. హీరోలంతా భయంభయంగానే షూటింగులు చేస్తున్నారు. ఇటీవలే థియేటర్ల ఓపెనింగ్ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అవికూడా పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదు.

వీటికితోడు కేంద్ర ప్రభుత్వం 50శాతం అక్యుపెన్సీ.. కరోనా నిబంధనలు పాటించాలని సూచించడం థియేటర్ల యజమానులకు భారంగా మారింది. ఇలా చేస్తే తమకు నిర్వహణ ఖర్చులు కూడా రావని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ కాలేదని తెలుస్తోంది.

కరోనా ప్రభావంతో నిర్మాతలు.. పంపిణీదారుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం కన్పిస్తోంది. పరిమిత అక్యుపెన్సీతో కొత్త సినిమాల రిలీజుకు పంపిణీ దారులు నిర్మాతలు ఒప్పించడం కత్తి మీద సాములా మారనుంది. ఈక్రమంలోనే కనీసం ఒకటి నుండి రెండేళ్ల వరకు థియేట్రికల్ వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ మిగతా ఫిల్మ్ బిజినెస్ మోడళ్లలో ఎటువంటి మార్పు కనిపించక పోవచ్చని తెలుస్తోంది.

Also Read: ఆ కంటెస్టెంట్ పై ‘బిగ్ బాస్’ కుట్ర.. బయట పెట్టిందెవరు? .!

భారీ బడ్జెట్ చిత్రాలు.. ప్యాన్ ఇండియా మూవీలు రిలీజ్ చేయాలంటే కనీసం థియేటర్లలో 75శాతం అక్యుపెన్సీ ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. దీంతోపాటు టాలీవుడ్ సినిమాలు ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాల్లో పంపిణీ చేయడం కష్టంగా మారనుంది. ఈ ప్రభావం భారీ బడ్జెట్.. ప్యాన్ ఇండియా సినిమాలపై పడనుంది.

ఇది ప్రాంతీయ సినిమా ఇండస్ట్రీపై భారీ ప్రభావం చూపేలా కన్పిస్తోంది. కరోనాకు వాక్సిన్ వస్తే తప్ప చిత్రపరిశ్రమ పూర్తి స్థాయిలో కోలుకోలేదని టాక్ విన్పిస్తోంది. అంతవరకు చిత్రసీమ సంక్షోభాన్ని ఎదుర్కొక తప్పదనే సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్