https://oktelugu.com/

గ్రేటర్‌‌ లో కేసీఆర్ ఎంట్రీ‌‌.. ఇలా షాక్ ఇచ్చాడా?

ఏ ఎన్నికల్లో అయినా గెలుపు తమదేనన్న ఓవర్‌‌ కాన్ఫిడెన్స్‌ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను పుట్టిముంచింది. భారీ మెజార్టీతో గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌‌, మంత్రుల మాటలు చివరికి నీటి మూటలయ్యాయి. భారీ మెజార్టీ ఏమో కానీ.. కనీసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవలేని పరిస్థితి. ఎలాగైనా గెలిచి తీరుతామన్న లెక్కల్లో ఉన్న సీఎం కేసీఆర్‌‌ కనీసం దుబ్బాకలో ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఆ ఎన్నికల్లో బోల్తా పడడంతో గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీ అంత ఈజీగా తీసుకోవద్దని ఫిక్స్‌ అయ్యారు కేసీఆర్‌‌. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 01:43 PM IST
    Follow us on

    ఏ ఎన్నికల్లో అయినా గెలుపు తమదేనన్న ఓవర్‌‌ కాన్ఫిడెన్స్‌ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను పుట్టిముంచింది. భారీ మెజార్టీతో గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌‌, మంత్రుల మాటలు చివరికి నీటి మూటలయ్యాయి. భారీ మెజార్టీ ఏమో కానీ.. కనీసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవలేని పరిస్థితి. ఎలాగైనా గెలిచి తీరుతామన్న లెక్కల్లో ఉన్న సీఎం కేసీఆర్‌‌ కనీసం దుబ్బాకలో ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఆ ఎన్నికల్లో బోల్తా పడడంతో గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీ అంత ఈజీగా తీసుకోవద్దని ఫిక్స్‌ అయ్యారు కేసీఆర్‌‌.

    Also Read: ఫస్ట్‌ లిస్టులో ప్రముఖులకు షాకిచ్చిన కేసీఆర్!

    అందుకే.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కేటీఆర్ రోడ్ షోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారం రోజులపాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఫినిషింగ్ టచ్‌గా కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగసభలో ప్రసంగించే ఏర్పాట్లను టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ సభ జరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రమాదకరంగా మారుతుండటం.. ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించే ప్రమాదం ఏర్పడటంతో.. కేసీఆర్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

    గ్రేటర్‌‌లో ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌కు సహజంగానే అవగాహన ఉంది. ఎంఐఎంకు కాస్త పోటీ వచ్చే చోట.. హిందూ ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ అభ్యర్థులను నిలుపుతున్నారు. మైనార్టీ ఓట్లు టీఆర్ఎస్‌కు పడాల్సిన చోట.. ఎంఐఎం అభ్యర్థులను నిలపదు. అదే సమయంలో.. బీజేపీ గెలిస్తే.. మత కల్లోలాలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలే వ్యూహంతో కేసీఆర్ ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్‌లో కూడా దీన్నే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా.. మత విద్వేషాలతో కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు.

    Also Read: జీహెచ్‌ఎంసీలో జనసేనకు ఓట్లు రాలేనా?

    అయితే.. కేసీఆర్‌‌ ప్రచారంలోకి వస్తే ఆయన మాటలు ముక్కుసూటిగానే ఉంటాయి. ఆయన నేరుగా ఎప్పుడూ ఓట్లు అడగరు. చెప్పాల్సిందంతా చెప్పి ప్రజలే తేల్చుకోవాలని చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ ప్రజలను ఆలోచింప చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.. రాజకీయ సభల్లో ప్రసంగించింది లేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అందుకే.. ఒక్క సభ అయినా గ్రేటర్ ఎన్నికల్లో పెట్టాలని యోచిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్