https://oktelugu.com/

ఐదుగురు అన్నాదమ్ములకు ఒక్కరే భార్య.. ఎక్కడంటే..?

మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు ఐదుగురు అన్నాదమ్ములను పెళ్లి చేసుకున్న ద్రౌపది కథ తెలిసే ఉంటుంది. ఐదుగురిని వివాహం చేసుకోవడం వల్లే ఆమెను పాంచాలి అని పిలుస్తాం. అయితే ఆ కాలంలో జరిగింది కానీ ప్రస్తుత కాలంలో ఐదుగురు అన్నాదమ్ములను ఒకే యువతి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం అది సాధ్యమేనని నిరూపించింది. Also Read: డబ్బుల కోసం ఆ పని చేయలేనంటున్న యాంకర్ విష్ణుప్రియ..! మన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 27, 2020 / 12:38 PM IST
    Follow us on

    మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు ఐదుగురు అన్నాదమ్ములను పెళ్లి చేసుకున్న ద్రౌపది కథ తెలిసే ఉంటుంది. ఐదుగురిని వివాహం చేసుకోవడం వల్లే ఆమెను పాంచాలి అని పిలుస్తాం. అయితే ఆ కాలంలో జరిగింది కానీ ప్రస్తుత కాలంలో ఐదుగురు అన్నాదమ్ములను ఒకే యువతి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం అది సాధ్యమేనని నిరూపించింది.

    Also Read: డబ్బుల కోసం ఆ పని చేయలేనంటున్న యాంకర్ విష్ణుప్రియ..!

    మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ వింత సాంప్రదాయం అమలులో ఉంది. హిమాచల్ ప్రదేశ్ నేటికీ ఐదుగురు అన్నాదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకుని సంసారం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని తెగలు ఒకే కుటుంబంలో ఎంతమంది అన్నాదమ్ములు ఉన్నా ఒకే మహిళను పెళ్లి చేసుకునే వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని కుటుంబాలు ఈ వింత ఆచారాన్ని అనుసరిస్తున్నాయి.

    Also Read: ‘ఆదిపురుష్’: ప్రభాస్ పారితోషికం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!

    అన్నాదమ్ములు వేర్వేరు అమ్మాయిలను చేసుకుంటే వేర్వేరు కాపురాలను పెట్టుకుంటారని అలా చేయడం వల్ల కుటుంబాలు విడిపోయే అవకాశం ఉందని భావించి కొన్ని తెగలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వ్యవసాయం ద్వారా సంపాదించే ఆదాయం వల్ల కుడా గొడవలు రావని ఈ తెగలు భావిస్తున్నాయి. అయితే ఈ సంప్రదాయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం: వైరల్

    ఈ తెగల్లో కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుని వచ్చిన దానిని సమానంగా పంచుకుంటారు. ఆస్తి విషయంలో సమస్యలకు పరిష్కారంగా ఈ విధంగా చేస్తున్న ఈ సంప్రదాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళను కలియుగ పాంచాలి అని అన్నాదమ్ములను కలియుగ పాండవులు అని నెటిజన్లు పిలుస్తున్నారు.