https://oktelugu.com/

Ram Charan-Buchi Babu: రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాలో స్టార్ యాక్టర్స్ నటించనున్నారా..?

Ram Charan-Buchi Babu: శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.

Written By: , Updated On : June 18, 2024 / 05:13 PM IST
Ram Charan-Buchi Babu Movie Updates

Ram Charan-Buchi Babu Movie Updates

Follow us on

Ram Charan-Buchi Babu: మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఎప్పుడైతే ‘మగధీర ‘ సినిమా చేశాడో అప్పటినుంచి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించడమే కాకుండా రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డును కొట్టిన హీరోగా కూడా ఒక భారీ విక్టరీని సాధించాడు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో కొంతమంది స్టార్ యాక్టర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కన్నడ స్టార్ అయిన కిచ్చ సుదీప్ తో పాటు గా, తమిళ్ స్టార్ అయిన విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ సంవత్సరం రానట్టేనా..?

అయితే వీళ్ళిద్దరి క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషించబోతున్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరితో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే కన్నడలో సూపర్ స్టార్ గా ఉన్న కిచ్చ సుదీప్, తమిళంలో స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి ఉండడం అనేది నిజంగా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికైతే బుచ్చిబాబు వీళ్లను తీసుకునన్నాడుఅనే వార్తలైతే వస్తున్నాయి.

Also Read: Jailed Heroes : ప్రేయసి కోసం నేరాలు చేసి జైలు పాలైన హీరోలు… సినిమాలకు మించిన క్రైమ్ స్టోరీస్!

ఇక వీళ్ళతో పాటు మరికొంతమంది నటులను కూడా తీసుకునే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…అయితే దీనిమీద సినిమా యూనిట్ ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వలేదు తొందర్లోనే ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో బుచ్చిబాబు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అందుకొని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడా లేదా అనేది…