https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ సంవత్సరం రానట్టేనా..?

Pawan Kalyan: సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ల్లో పాల్గొనక పోవడం వల్ల ఆ సినిమా డేట్లని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 18, 2024 / 05:07 PM IST

    Pawan Kalyan movies will not come this year

    Follow us on

    Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశమంతటా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఆయన భారీ విజయం సాధించడమే కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయి అంటూ అతని అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాలోకి ఆయన ఎంటర్ అవ్వకముందే ఇండియా వైడ్ గా తన పేరు మారుమ్రోగిపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాల పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే దాని పైననే ఒక క్లారిటీ అయితే రావడం లేదు. మరి ఆయన ఎప్పుడు షూటింగ్ ల్లో పాల్గొంటాడు అనే దాన్నిబట్టి ఆ సినిమాలా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇక ముందుగా సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ల్లో పాల్గొనక పోవడం వల్ల ఆ సినిమా డేట్లని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది.

    Also Read: Jailed Heroes : ప్రేయసి కోసం నేరాలు చేసి జైలు పాలైన హీరోలు… సినిమాలకు మించిన క్రైమ్ స్టోరీస్!

    తీరా షూటింగ్స్ లో పాల్గొన్న తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఒక పని అయిపోతుంది. అంటూ ఆయా సినిమాలా ప్రొడ్యూసర్లు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. ఇక వచ్చే సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అందులో ఉన్న అవక తవకాలని చూసుకొని ఏం చేయాలి ఎలా చేయాలి అనే ప్రణాళికలను రూపొందించుకొని అన్ని క్లియర్ అయిన తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు మూడు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి…