https://oktelugu.com/

Jailed Heroes : ప్రేయసి కోసం నేరాలు చేసి జైలు పాలైన హీరోలు… సినిమాలకు మించిన క్రైమ్ స్టోరీస్!

Jailed Heroes ఇదే తరహాలో మలయాళ హీరో దిలీప్ భార్య కోసం నటి భావన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 03:59 PM IST

    Heroes who committed crimes for their girlfriends and went to jail

    Follow us on

    Jailed Heroes : ఏ స్థాయిలో ఉన్న స్త్రీ మైకం మగవారిని మూర్ఖులను చేస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఉదంతాలు. భార్య, ప్రియురాళ్ల కోసం మర్డర్లు, మానభంగాలకు పాల్పడిన ఈ హీరోల క్రైమ్ స్టోరీస్ వణుకు పుట్టిస్తాయి. కన్నడ పరిశ్రమను దర్శన్ అరెస్ట్ కుదిపేస్తోంది. శాండిల్ వుడ్ లో దర్శన్ టాప్ హీరో. అశేష అభిమానులు గల స్టార్. అంతటి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఒక సామాన్యుడిని హత్య చేయించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలవాల్సిన వాడు ప్రాణం తీసి జైలు పాలయ్యాడు.

    కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన దర్శన్ స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్డం వచ్చాక దర్శన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. దర్శన్ 2003లో బంధువుల అమ్మాయి విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి. భార్యతో కాపురం చేస్తూనే… నటి పవిత్ర గౌడతో పదేళ్లుగా దర్శన్ అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. పవిత్ర-విజయలక్ష్మి మధ్య ఇటీవల సోషల్ మీడియా వార్ జరిగింది. 2011లో దర్శన్ మీద విజయలక్ష్మి గృహహింస కేసు పెట్టింది.

    దర్శన్ ప్రేయసి పవిత్రకు రేణుక స్వామి అనే వ్యక్తి అసభ్యకర సందేహాలు, ఫోటోలు పంపాడు. రేణుక స్వామి మీద దర్శన్ కి పవిత్ర ఫిర్యాదు చేసింది. ఆగ్రహానికి గురైన దర్శన్ తన మనుషులతో రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి, అనంతరం మర్డర్ చేశాడు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో పాటు 11 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దర్శన్ ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు లేవు.

    ఇదే తరహాలో మలయాళ హీరో దిలీప్ భార్య కోసం నటి భావన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దిలీప్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పని చేశాడు. పలు చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేశాడు. ఏ పెరుక్కుమ్ తాళిక, కుబేరన్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. 1998లో నటి మంజు వారియర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి.

    కావ్య మాధవన్ తో ప్రేమలో పడిన దిలీప్ భార్యకు విడాకులు ఇచ్చి… ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కావ్య మాధవన్, హీరోయిన్ భావన మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్యను సంతృప్తి పరచడం కోసం భావన మీద రేప్ అటెంప్ట్ చేయించాడు. విచారణ చేపట్టిన కేరళ పోలీసులు 2017 జులై 10 దిలీప్ ని అరెస్ట్ చేశారు. దాదాపు మూడు నెలలు జైలులో ఉన్న దిలీప్ 2017 అక్టోబర్ 3న బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు సుదీర్ఘ కాలం సాగింది. బాలకృష్ణ, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి స్టార్స్ విభిన్నమైన నేరాలు చేసి అరెస్ట్ అయ్యారు. జైలు జీవితం అనుభవించారు.