Prabhas Fauji: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ ప్రభాస్ గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు అలాంటివి చాలా తక్కువ రోజుల్లోనే పాన్ ఇండియా సినిమాలను చేయడంలో కూడా ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. అందుకే ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఈ సంవత్సరం ‘ కల్కి ‘ సినిమాని రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక వచ్చే ఏడాది ‘ రాజా సాబ్ ‘ సినిమాను రిలీజ్ చేయాలనే ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఇంత బిజీగా ఉండడం అనేది నిజంగా ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి. ఇక బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ ను ఫోకస్ చేస్తూ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవ పూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి.
కానీ వాటిని రీచ్ అయ్యేవిధంగా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో హను రాఘవపూడి సీతా రామం సినిమా చేసి ఒక మంచి విజయాన్ని సాధించాడు. అలాగే తన కెరియర్ లో ఒక మంచి లవ్ స్టోరీని కూడా తెరకెక్కించాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి హను రాఘవ పూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడానికి ఆయన తీవ్రమైన కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దసరా రోజు ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని హను రాఘవ పూడి భావిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆయన అనుకున్నట్టుగానే దసర కానుకగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పటికే ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో అయితే నటించబోతున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…