Nagarjuna: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లు సమంత, నాగ చైతన్య. ఏ ముహూర్తం లో వీళ్లిద్దరు కలిసారో కానీ, వీళ్ళు విడిపోయినా వీళ్ళ చుట్టూ జరిగే సంఘటనలు మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు వీళ్లిద్దరి పేర్ల మీద ఎదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంట్ గానే నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లిద్దరి మీద సోషల్ మీడియా లో ఎన్ని కథనాలు వచ్చాయో తెలియదు కానీ, సమంత – నాగ చైతన్య గురించి బోలెడన్ని వార్తలు ఈరోజుటికి కూడా ప్రచారం అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా నాగార్జున ఒక నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ నాగ చైతన్య గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది.
ఆయన మాట్లాడుతూ ‘సమంత తో నా కొడుకు నాగ చైతన్య విడిపోయిన తర్వాత మా ఇంట్లో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగ చైతన్య విడిపోయిన కొత్తల్లో నరకం అనుభవించే వాడు. ఆమెతో విడిపోయిన కొత్తల్లో అసలు మనిషి మనిషిలాగానే ఉండేవాడు కాదు, రోజురోజుకి ఇలా అయిపోతున్నాడేంటి అని నేను దిగులు చెందేవాడిని. ఆమె విడిపోయిన కొత్తల్లో మా ఇంట్లో జరిగిన సంఘటనలు మేము జీవితంలో ఎదురుకున్న అత్యంత కష్టమైన సంఘటనలు. మేము ఎదురుకున్న గడ్డు కాలం అదే. ఇప్పుడు నాగ చైతన్య ని సంతోషం గా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. శోభిత వాడికి దూరమైన ఆనంద క్షణాలను మళ్ళీ దగ్గర చేసినందుకు ఆనందంగా ఉంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. రీసెంట్ గానే ఆయన శోభిత ని నిశ్చితార్థం చేసుకున్నాడు, అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.
అయితే నాగార్జున మాట్లాడిన మాటలకు, సోషల్ మీడియా లో గత కొంతకాలం గా జరుగుతున్న ప్రచారాలకు అసలు పొంతన కుదరడం లేదు. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణమే శోభిత తో నాగ చైతన్య పెట్టుకున్న సంబంధం వల్ల, వీళ్ళ విషయం ఇంట్లో తెలియడం వల్లే ఇంత పెద్ద గొడవ జరిగి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో బాధ పడ్డాడు అని నాగార్జున అంటున్నాడేంటి అని అనుకుంటున్నారు నెటిజెన్స్. సమంత తో విడాకులు తీసుకున్న రెండు నెలలకే నాగ చైతన్య శోభిత తో డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్ వచ్చింది, విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఘోరంగా ఎఫెక్ట్ అయ్యింది, మయోసిటిస్ వ్యాధికి గురైంది, ప్రాణాలు కోల్పోయేంత స్థితికి వెళ్ళొచ్చింది, నాగ చైతన్య పై ఎలాంటి ప్రభావం పడలేదు, విడాకులు తీసుకున్న తర్వాత హమ్మయ్యా, పెద్ద చిక్కు వదిలింది అని అనుకొని ఉంటాడు, నాగార్జున తన కొడుకు మీద సానుభూతి పెరగడం కోసమే ఇలాంటి కామెంట్స్ చెడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.