https://oktelugu.com/

Taman and Balayya : తమన్ కి బాలయ్య పేరు చెప్పిన విజువల్ చూసిన పూనకాలు వస్తాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి కానుకగా వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 01:32 PM IST

    Taman , Balayya

    Follow us on

    Taman and Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి కానుకగా వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక అందులో బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా తనదైన రీతిలో వసూళ్లను రాబడుతూ ఆయన ఇమేజ్ ను రెట్టింపు చేస్తూ ముందుకు సాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా వరుసగా బాలయ్య బాబు నాలుగు విజయాలను అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా గురించి చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    ఇక బాలయ్య బాబు సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు బిజిఎం అదిరిపోతుంది అంటూ ప్రతి ఒక్కరు చాలా మంచి కంగిడెంట్ గా ఉంటున్నారు. కారణం ఏదైనా కూడా బాలయ్య బాబు పేరు చెప్పిన ఆ కట్ఔట్ చూసినా కూడా తమన్ లో పూనకాలు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా తమన్ కూడా ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం.

    అందుకోసమే బీభత్సమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడమే కాకుండా థియేటర్లో స్పీకర్లు పగిలిపోయేలా చేస్తున్నాడు. ఇక బాలయ్య మూవీస్ విజయంలో తమన్ కీలక పాత్ర వహిస్తున్నాడు. కాబట్టి బాలయ్య అభిమానులు తమన్ కి వీరాభిమానులుగా మారిపోయారు. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు పేరు చెబితే చాలు తమన్ లో ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది. తద్వారా ఆ మ్యూజిక్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఈ సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ మరింత కాలం ముందుకు సాగాలని ప్రతి ఒక్క అభిమానితో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇక ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ లో తమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా కీలకపాత్ర వహించిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడమే కాకుండా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుంది. తద్వారా బాలయ్య బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…