Chiranjeevi and Srikanth Odela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరిలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో 70 సంవత్సరాలు వయసులో కూడా మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి… గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యం ఏలుతూ ముందుకు సాగుతున్న ఈ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే కొన్ని సినిమాలను లైన్ లో పెడుతూ తన అభిమానులకు ఆనందాన్ని పంచే విధంగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ జానర్ లో సాగుతూ ఉండటం విశేషం… ఇక దీనిని మినహాయిస్తే ఆ తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇది ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న చిరంజీవి శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్న శ్రీకాంత్ ఓదెల ఈ గ్యాప్ లో నానితో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా చిరంజీవితో చేయబోతున్న సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు శ్రీకాంత్ ఓదెల చేసిన దసర సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ తో కూడుకున్నదిగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో కూడా అంతకుమించిన ఎలివేషన్స్ తో విలనిజాన్ని చూపిస్తూ చిరంజీవి తాలూకు ఎమోషన్స్ ను కూడా బిల్డ్ చేసే విధంగా ఆయన కథని రాసుకున్నారట.
మరి ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమా లో విలన్ గా తమిళ్ స్టార్ హీరో అయిన విక్రమ్ నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల అతన్ని కలిసి అతనికి కథను కూడా వినిపించారట. మరి ఆ కథ నచ్చిన విక్రమ్ ఇప్పుడు చిరంజీవితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి తొందర్లోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి…