UK : మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. అది లేకుండా కనీసం ఓ ఐదు నిమిషాలు కూడా గడవదు. ఛార్జింగ్ అయిపోతే ప్రాణం ఆగినంత పని అవుతుంది. దాని పేరు వినగానే అందరికీ ఒక రకమైన ఉపశమనం కలుగుతుంది. మొబైల్ సహాయంతో ఈ రోజుల్లో చాలా పనులు చాలా సులభంగా జరుగుతున్నాయి. నేటి కాలంలో మన దైనందిన జీవితం మొబైల్ ఫోన్లపై ఆధారపడి ఉంది. దీని ద్వారా ట్రాన్సాక్షన్లు, షాపింగ్, ఇతర పనులను ఇంట్లో కూర్చొనే పూర్తి చేస్తున్నాము మొబైల్ ఫోన్ ప్రజల జీవితాలను ఎంత సులభతరం చేసిందో, అంతే సమస్యలను కూడా సృష్టించింది.
ఇందులో అతిపెద్ద వ్యసనం మొబైల్ ఫోన్ వాడడం. కానీ నేటి కాలంలో మొబైల్ రింగ్ అయిన వెంటనే ప్రజలు భయపడిపోతారంటే మీరు నమ్ముతారా? కాదా ? కానీ బ్రిటన్‌లో మొబైల్ ఫోన్ రింగ్ అవుతుందంటై దాని శబ్ధం విని భయపడే యువకులు 25 లక్షలకు పైగా ఉన్నారు. ఏం ఆశ్చర్యపోతున్నారా.. అవును ఈ వ్యాధిని కాల్ ఆందోళన లేదా టెలిఫోబియా అంటారు. ఈ భయాన్ని తొలగించడానికి ఒక కోర్సు ప్రారంభించారు.
టెలి-ఫోబియాతో బాధపడుతున్న లక్షలాది మంది
టెలిఫోబియా వ్యాధి ప్రాథమికంగా ఒత్తిడి లక్షణం. దీనిలో ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఫోన్ వస్తే కాల్స్ తీయాలని కూడా అనిపించదు. ఈ ఒత్తిడి కారణంగా ప్రజలు నిశ్శబ్దంగా ఉంటారు. వారి ప్రశాంత స్వభావం కారణంగా మొబైల్ ఫోన్ మోగితేనే వాళ్లు భయంతో వణికిపోతారు. నేడు లక్షలాది మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
టెలిఫోబియాకు ఎలా చికిత్స చేస్తారు?
టెలిఫోబియా వ్యాధి చికిత్స ఇప్పుడు ప్రారంభించబడింది. దీని కోసం కోచింగ్ తరగతులు యూకేలోని నాటింగ్‌హామ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు వారు ఎలా మాట్లాడాలో తరగతిలో నేర్పిస్తున్నారు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. దీంతో వారు టెలిఫోబియా నుండి కోలుకుంటున్నారు. దీనితో పాటు ప్రజలతో మాట్లాడటానికి వారికి అవగాహన కల్పిస్తున్నారు. దీనితో పాటు, టెలిఫోబియాతో బాధపడుతున్న వ్యక్తులు ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలను ఎలా వ్యక్తపరచవచ్చో చెబుతున్నారు. కోచింగ్ తరగతుల్లో వారి అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించడం కూడా నేర్పుతున్నారు.
యువత మాత్రమే ఈ వ్యాధికి ఎందుకు బలైపోతున్నారు?
నేటి యువతలో ఎక్కువ మంది మెసేజ్ ల ద్వారానే సంభాషిస్తున్నారని ఒక నివేదిక పేర్కొంది. చాలా అరుదుగా ఒకరికొకరు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటారు. అందుకే వాళ్ళు కాల్స్ లో తడబడతారు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల 70శాతం మంది మెసేజ్ ల ద్వారా మాట్లాడటానికి ఇష్టపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. ఎందుకంటే ఇదే వారి కంఫర్ట్ జోన్. అందుకే వారు ఈ వ్యాధి బాధితులుగా మారుతున్నారు.