OG Collections: మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చారు వంటి వివరాలు కాసేపట్లో తెలియనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ శనివారం, లేదా ఆదివారం రోజున ఇండియా వైడ్ గా మొదలు పెట్టబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సమందించిన టికెట్ రేట్స్ GO లను ఈ నెల 20 న వస్తాయని ఆశిస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ఓవర్సీస్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ట్రేడ్ విశ్లేషకులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
సినిమా విడుదలకు ఇంకా 8 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కలను ప్రకారం దాదాపుగా 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఇంకా పూర్తి స్థాయి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తాన్ని ప్రారంభిస్తే వంద కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అవలీలగా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు విడుదలకు ముందు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిన చిత్రాలు #RRR, పుష్ప 2 మరియు కూలీ మాత్రమే. ఇప్పుడు ‘ఓజీ’ చిత్రం నాల్గవ చిత్రంగా నిలబడబోతుంది. స్టార్ డైరెక్టర్ సహకారం లేకుండా, కేవలం పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ సినిమా అనే జానర్ తోనే ఈ సినిమాకు ఇంతటి హైప్, క్రేజ్ ఏర్పడింది.
ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రం ఎన్టీఆర్(Junior NTR) నటించిన దేవర(Devara Movie) చిత్రం ఫుల్ రన్ వసూళ్లను కేవలం నాలుగు రోజుల్లోనే దాటేస్తుందని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దేవర చిత్రానికి ఫుల్ రన్ లో దాదాపుగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓజీ చిత్రానికి మొదటి రోజే 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని, వీకెండ్ లోపే దేవర క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేస్తాము అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే కాస్త పాజిటివ్ టాక్ ఒక్కటే రావాలి. ఓజీ చిత్రానికి కేవలం తెలుగు లో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. టాక్ వస్తే పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ ఎంట్రీ సినిమాగా నిలుస్తుంది ఓజీ.