Sujeeth OG: కొన్ని కొన్ని సార్లు హీరోలు కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్నప్పుడు అభిమానులే డైరెక్టర్స్ గా మారి తమ హీరోలకు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇస్తుంటారు. గతం లో ఇలాంటివి చాలానే జరిగాయి. ఉదాహరణకు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్ ‘ తో, కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’ తో, లోకేష్ కనకరాజ్ ‘విక్రమ్’ సినిమాతో, బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో తమ అభిమాన హీరోలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ ని అందించారు. ఇప్పుడు డైరెక్టర్ సుజిత్(Sujeeth) వంతు వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని మొదటి రోజు మొదటి ఆట చూసి, థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు ‘జిందాబాద్ పవర్ స్టార్’ అంటూ ఈయన అరిచిన అరుపులను మనం అంత తేలికగా మరచిపోలేము. ఆ చిన్న కుర్రాడు ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఓజీ'(They Call Him OG) లాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండదు.
Also Read: ‘ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్ ఏంటి ఇలా ఉంది…
ఈ సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది మనం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ చూసి ఊహించుకోవచ్చు. కచ్చితంగా ఈయన పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం గుర్తించుకునే సినిమా ఇస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా ప్లాన్ ప్రకారమే పూర్తి అయ్యుంటే గత ఏడాది సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పెండింగ్ లో పడింది. దాదాపుగా ఏడాది వరకు ఆగిపోయింది. సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్ళలో డైరెక్టర్ సుజిత్ కి బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చాయో తెలుసా?, పఠాన్ కి బదులు షారుఖ్ ఖాన్ సుజిత్ తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఓజీ కి కమిట్ అయ్యి ఉండడం వల్ల చెయ్యలేకపోయాడు.
మధ్యలో పవన్ కళ్యాణ్ ఏడాది వరకు ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చినప్పుడు, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ నుండి కూడా ఒక ఆఫర్ వచ్చింది. దానిని కూడా ఈయన రిజెక్ట్ చేసాడు. ఓజీ చిత్రం పూర్తి అయ్యేంత వరకు ఏ సినిమాకు కూడా షిఫ్ట్ అయ్యేది లేదని , తన అభిమాన హీరో కి, నా తోటి అభిమానులకి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన ఫోకస్ మొత్తం ఈ సినిమా పైనే పెట్టాడు. ఈ చిత్రం సుజిత్ కి ఒక సవాల్ లాంటిది. ఈ చిత్రం కోసం నేడు పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు. సినిమా హిట్ అయితే సుజిత్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ డైరెక్టర్ అయిపోతాడు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం కోలుకోవడం కష్టం. మరి ఆయన కెరీర్ పైకి వెళ్లబోతుందా?, క్రిందకి పడిపోతుందా అనేది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.