Sundeep Kishan: మన టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, కాలం కలిసిరాక ఇప్పటికీ సరైన మార్కెట్ ని క్రియేట్ చేసుకొని హీరోలు కొంతమంది ఉన్నారు. వారిలో సందీప్ కిషన్(Sandeep Kishan) కూడా ఒకడు. ఈయన ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టి దాదాపుగా 15 ఏళ్ళు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో సాధించిన కమర్షియల్ విజయాలు ఎన్ని అని అడిగితే ఒకటి రెండు తప్ప మరో సినిమా కనిపించదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించి కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న ‘మజాకా’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా కెరీర్ మొత్తం అత్యధిక శాతం ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు దర్శకత్వం లో హీరో గా ఒక సినిమా చేస్తున్నాడు. ఇదే ఆయన చివరి ఆశ అనుకోవచ్చు.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
ఇదంతా పక్కన పెడితే సందీప్ కిషన్ కి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. కానీ ఒక ఫ్లాప్ సినిమా చేయడం కోసం ఆ క్రేజీ ఆఫర్ ని వదులుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే తేజ సజ్జ హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ మార్కు కి చాలా దగ్గరగా వెళ్ళింది ఈ చిత్రం. ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేసిన మంచు మనోజ్ కి ఎంత మంచి పేరొచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. హీరో కంటే పవర్ ఫుల్ క్యారక్టర్ అనే పేరొచ్చింది. వాస్తవానికి ఈ క్యారక్టర్ ని ముందుగా సందీప్ కిషన్ కోసమే అనుకున్నారట మేకర్స్. ఇదే విషయాన్నీ తేజ సజ్జ కి చెప్పగా ఆయన కూడా ఓకే అన్నాడు, సందీప్ కిషన్ ని కలిసి స్టోరీ కూడా వినిపించాడు.
ఆయనకు బాగా నచ్చింది,చేస్తానని మాట కూడా ఇచ్చాడట కానీ, భవిషత్తులో వచ్చిన కొన్ని కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమా నుండి సందీప్ కిషన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తేజ సజ్జ నేరుగా మనోజ్ కి ఫోన్ చేసి ఆయనని కలిసి ఈ స్టోరీ ని వినిపించి ఒప్పించారట. ఈ విషయాన్నీ స్వయంగా మంచు మనోజ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు . కెరీర్ లో గర్వంగా చెప్పుకోదగ్గ ఒక్క సూపర్ హిట్ కూడా లేని సందీప్ కిషన్ కి ఈ సినిమా చేసుంటే కెరీర్ కి బాగా కలిసి వచ్చి ఉండేది. కష్టమైన ఒప్పుకొని చేసుంటే ఈరోజు సందీప్ కిషన్ కాస్త బెటర్ స్థానం లో ఉండేవాడేమో, బ్యాడ్ లక్ అంటే ఇదే కదా.