Niharika Konidela: నిహారిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా?

పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది నిహారిక. అందుకే ఇండస్ట్రీకి, నిహాకు బంధం దూరం అయిందనే చెప్పాలి. కానీ ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

Written By: Velishala Suresh, Updated On : November 7, 2023 12:28 pm

Niharika Konidela

Follow us on

Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోయిన్ లు లేరనే చెప్పాలి. గతంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం కేవలం నిహారికనే.. నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఫాలోయింగ్ ను సంపాదించింది ఈ అమ్మడు. అలా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. ఇక హోస్ట్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ అదృష్టం కలిసి రాక ఆమె నటించిన సినిమాలు పెద్దగా పేరు సంపాదించి పెట్టలేకపోయాయి. అయితే ఇప్పుడు అందరూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు.. మరి నిహారిక సంగతి ఏంటి?

పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది నిహారిక. అందుకే ఇండస్ట్రీకి, నిహాకు బంధం దూరం అయిందనే చెప్పాలి. కానీ ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత కచ్చితంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని మెగా ఫ్యామిలీ అభిమానులు అనుకున్నారు. అంతేకాదు నిహారిక సినిమాల్లో ఫుల్ స్వింగ్ తో కమర్షియల్ పాత్రతో అందాల ఆరబోత చేసే విధంగా నటించబోతుంది అనుకున్నారు కూడా. ఈ విధమైన చర్య మెగా వర్గాల్లో చర్చ సాగింది. కానీ ఈ విషయం గురించి ఇప్పటికే ఎలాంటి క్లారిటీ లేదు.

తెలుగులో నిహారికకు పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు. కానీ ఆమెకు తమిళ్ లో ప్రయత్నిస్తే వరుస ఆఫర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో నిహారిక నటించిన విషయం తెలిసిందే. అందుకే అక్కడ ప్రయత్నిస్తే ఫలితాలు ఉంటాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మాత్రమే మస్ట్ అనే విధంగా హీరోయిన్ లకు పోటీ ఇస్తుంది నిహారిక. కానీ సినిమాల్లో నటించడం పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా తెలియజేసిందట. అంటే సినిమాల్లోకి నిహారిక రీ ఎంట్రీ అనే వార్తల్లో వాస్తవం లేదనే చెప్పాలి.