HomeతెలంగాణHyderabad Football : హైదరాబాద్ లో ఫుట్ బాల్.. ఏంటీ సామీ ఈ క్రేజ్.. నరాలు...

Hyderabad Football : హైదరాబాద్ లో ఫుట్ బాల్.. ఏంటీ సామీ ఈ క్రేజ్.. నరాలు కట్ అయిపోతున్నాయ్

Hyderabad Football : ఫిఫా ప్రపంచ ఫుట్ బాల్ కప్ చివరి దశకు చేరుకుంది. ట్రోఫీ కోసం అర్జెంటీనా.. స్పెయిన్ పోటీ పడుతున్నాయి. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని వీక్షించడానికి చాలామంది ఇప్పటికే సిద్ధమయ్యారు. ఫుట్ బాల్ ప్రేమికులు ఫైనల్ మ్యాచ్ జరిగే స్టేడియానికి వెళ్ళగా.. టికెట్లు లభించని వారు టీవీలకు అతుక్కుపోవడానికి సిద్ధమయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసే ఆటగా ఫుట్ బాల్ పేరు గడించింది. ఈ ఆట నువ్వా నేనా అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. ఆటగాళ్లకు మాత్రమే కాదు.. అభిమానులకు కూడా ఉత్కంఠ భరితమైన ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు.. ఎక్కువ అభిమానులు ఈ ఆటకు ఉన్నారు.

ఇక మనదేశంలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్.. కేరళ.. అస్సాం వంటి రాష్ట్రాలలో ఫుట్ బాల్ చూస్తుంటారు. జాతీయస్థాయి ఫుట్ బాల్ జట్టు క్రీడాకారుల్లో ఎక్కువమంది ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అయితే ఈసారి ఫిఫా ప్రపంచ కప్ లో అర్జెంటీనా జట్టు వరుసగా రెండవసారి ఫైనల్ వెళ్లడంతో హైదరాబాదులో విపరీతమైన సందడి ఏర్పడింది. ఈ చారిత్రాత్మకమైన మ్యాచ్ పెద్ద పెద్ద స్క్రీన్ ల మీద చూసేందుకు.. సంబరాలు జరుపుకునేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.

హైదరాబాద్ నగరంలో పేరుపొందిన ప్రముఖ హోటల్లు.. క్లబ్బులు.. పబ్బులకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చింది.. హోటల్లు.. పబ్బులు.. క్లబ్బుల వద్ద అర్జెంటీనా జెర్సీలు కనిపిస్తున్నాయి. మెసేజ్ కట్ అవుట్ లు దర్శనమిస్తున్నాయి.. అయితే హైదరాబాద్ నగరంలో ఇదంతా సోషల్ మీడియా హైప్ మాత్రమేనా.. ఆ స్థాయిలో క్రీడాకారులు ఉన్నారా..

హైదరాబాద్ నగరంలో ఈ ఆటకు పెద్దగా క్రేజీ లేదు. హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగిన స్థాయిలో క్లబ్బులు.. అకాడమీలు లేవు. హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలల్లో ఫుట్ బాల్ ను ఒక క్రీడగా నేర్పించడం లేదు. విద్యార్థులు కూడా ఆసక్తి చూపించడం లేదు. హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం ఒలంపిక్స్ లో భారత ఫుట్బాల్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.. ప్రస్తుతం క్రికెట్ మాయలో పడి చాలామంది ఈ ఆటను పూర్తిగా విస్మరిస్తున్నారు.

అర్జెంటీనా జట్టులో ప్రధాన ఆటగాడు మెస్సి కి బ్రాండ్ వేల్యూ ఉంది. అతడికి సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా అభిమానులు ఉన్నారు. పైగా అతడు హైదరాబాద్ గడ్డమీద అడుగుపెట్టాడు. దీంతో అతనికి సహజంగానే అభిమానుల దళం ఏర్పడింది. దీంతో అతడి సారథ్యంలో అర్జెంటీనా జట్టు వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతోంది. అతని ఆటను చూసేందుకు చాలామంది మ్యాచులు వీక్షిస్తున్నారు. దీనికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మెస్సికి అతను వీరాభిమాని. అందువల్లే ప్రభుత్వం ఈ ఫుట్బాల్ సంబరాలకు పచ్చ జెండా ఊపింది. సీఎం ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇక మనదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఫుట్బాల్ అనేది ఒక మతం లాగా ఉంటుంది. ఈస్ట్ బెంగాల్.. మోహన్ బగాన్ వంటి క్లబ్లో జరిగే మ్యాచ్లకు లక్షలాదిమంది అభిమానులు హాజరవుతారు. అది హైదరాబాదులో అయితే పబ్బుల్లో కూర్చుని.. ఇష్టం వచ్చిన డ్రింకు తాగుతూ.. మెసీను చూసి కేకలు వేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడం.. మెస్సి మానియా.. వంటివి తాత్కాలికంగా ఉంటాయా.. దీర్ఘకాలంలో హైదరాబాద్ యువతను ఫుట్బాల్ వైపు మళ్లిస్తాయా చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version