Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీకి భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్ చేసిన పనికి శివాజీ స్టన్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫ్యామిలీ వీక్ కి దగ్గరైంది. ప్రతి సీజన్లో 10వ వారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు వస్తారు. పది వారాలు అంటే దాదాపు రెండు నెలలు. ఇన్ని రోజులు కుటుంబ సభ్యులకు, ప్రపంచానికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్ కి ఊరట ఇచ్చే వీక్ ఇది. కంటెస్టెంట్స్ కి ఇది చాలా స్పెషల్.
అందుకే 10వ వారం వరకు ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం హౌస్లో 11 ;మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. శివాజీకి ఫస్ట్ ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ శివాజీ కోసం కొడుకును పంపాడు. అది కూడా ముసుగులో. శివాజీ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్ ముసుగులో కొడుకు వచ్చాడు. మాస్క్ ధరించి ఉన్న కొడుకును శివాజీ గుర్తించలేదు. నీకు ఎలా ఉందని డాక్టర్ వలె శివాజీని కొడుకు అడిగాడు.
కొంచెం నొప్పిగా ఉంటుందన్నాడు శివాజీ. వ్యాయామం చేస్తున్నారా? అని అడిగాడు. చేస్తున్నాను అని చెప్పాడు. మీకు ఓ మూడు రోజుల్లో నయం అవుతుందని చెప్పగా రూమ్ నుండి శివాజీ బయటకు వెళుతున్నాడు. అప్పుడు నాన్న అని కొడుకు పిలిచాడు. అప్పటికి కూడా శివాజీ పోల్చుకోలేదు. ముసుగు తీయడంతో స్టన్ అయ్యాడు. గట్టిగా కౌగలించుకుని ఏడ్చేశాడు. అసలు ఊహించలేదని చెప్పాడు.
చిన్న వాడు వస్తాడని ఊహించాను. నీకు సిగ్గు ఎక్కువ కదా అని శివాజీ కొడుకుతో అన్నాడు. నాకు యూనివర్సిటీ నుండి కాల్ వచ్చింది. వెళ్ళిపోతే మరలా నిన్ను కలిసే అవకాశం ఉండదు. అందుకే నేను వచ్చానని కొడుకు చెప్పాడు. శివాజీ కన్నీళ్లు పెట్టుకుంటుంటే… నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏడుస్తారు. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని కొడుకు ఓదార్చాడు. బిగ్ బాస్ షో ఎమోషనల్ ప్రోమో ఆకట్టుకుంది.
🏡 Sivaji is in for the surprise of a lifetime as his own son steps into the House. Don't miss this emotional rollercoaster as they come together! 🤗❤️ #BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel
Link: https://t.co/thF4i1aAku
— Starmaa (@StarMaa) November 7, 2023