https://oktelugu.com/

మహేష్ ‘పాట’ పాడితే ఆగేదే లేదట?

గత సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్టుందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరునికెవ్వరు’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో తెలుగులోనే కాకుండా ఓవర్స్ సీడ్స్ లో మంచి కలెక్షన్లు రాబట్టి మహేష్ సత్తాను మరోసారి చూపించింది. ఈ మూవీ తర్వాత మహేష్ చేస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీ విషయంలో మహేష్ బాబు పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నాడు. Also Read: పేరుకే చిన్నవి టెక్కులో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 06:23 PM IST
    Follow us on

    గత సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్టుందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరునికెవ్వరు’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో తెలుగులోనే కాకుండా ఓవర్స్ సీడ్స్ లో మంచి కలెక్షన్లు రాబట్టి మహేష్ సత్తాను మరోసారి చూపించింది. ఈ మూవీ తర్వాత మహేష్ చేస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీ విషయంలో మహేష్ బాబు పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నాడు.

    Also Read: పేరుకే చిన్నవి టెక్కులో మాత్రం పెద్దవి !

    ఇటీవల మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టందుకుంటున్నారు. దీంతో మహేష్ బాబు మరింత జోష్ తో వరుసగా సినిమాలను చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కరోనా కారణంగా షూటింగులన్నీ వాయిదా పడటంతో మహేష్ ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయి. అయితే ఇటీవల సూపర్ స్టార్ జన్మదినం సందర్భంగా మహేష్ బాబు తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందించి అభిమానుల్లో జోష్ నింపాడు. ‘సర్కారువారిపాట’ సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ అదేరోజు రిలీజ్ కావడంతో అభిమానులు కృష్ణ పుట్టినరోజున ఘనంగా సంబురాలు చేసుకున్నారు.

    ‘సర్కారువారిపాట’ మూవీకి పర్శురాం దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలు.. అవినీతిని వెలికితీసేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ విన్పిస్తోంది. ఈ మూవీలో మహేష్ కు జోడీ కీర్తి సురేష్ నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతోపాటు నటీనటుల ఎంపిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే డేట్స్ విషయంలో మాత్రం మహేష్ బాబు పక్కా ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: వైరల్ అవుతోన్న ‘రమ్యకృష్ణ -సత్యరాజ్’ వీడియో !

    ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైతే సింగిల్ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జనవరి మూడో వారంలో సినిమాను ప్రారంభించి నిరవధికంగా షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. ఇండియాతోపాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక రెండో షెడ్యూల్ అమెరికాలో సమ్మర్లో నిర్వహించనున్నారట. వేసవిలో షూటింగ్ ప్రారంభించి జూన్ చివరి వరకు పూర్తి చేయనున్నారు. ఇక ఆగస్టులో సినిమాను ప్రచారం ప్రారంభించి దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.