https://oktelugu.com/

పేరుకే చిన్నవి టెక్కులో మాత్రం పెద్దవి !

కరోనా మహమ్మారి రాకతో అనేక రంగాలు దెబ్బ తిన్నా… డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలు మాత్రం మారిపోయాయి. ఒకప్పటితో పోల్చుకుంటే.. వాటి స్తొమత స్థాయి పెరిగాయి. అయితే క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మైన మాట వాస్తవం. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలైనా… సినిమాల రిలీజ్ పరిస్థితి ఇంకా అయోమయంగానే ఉంది. ఇప్పటికే రెడ్, మాస్టర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2020 6:58 pm
    Follow us on

    కరోనా మహమ్మారి రాకతో అనేక రంగాలు దెబ్బ తిన్నా… డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలు మాత్రం మారిపోయాయి. ఒకప్పటితో పోల్చుకుంటే.. వాటి స్తొమత స్థాయి పెరిగాయి. అయితే క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మైన మాట వాస్తవం. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలైనా… సినిమాల రిలీజ్ పరిస్థితి ఇంకా అయోమయంగానే ఉంది. ఇప్పటికే రెడ్, మాస్టర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నా.. వాటిని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ మాత్రం ఇంట్రస్ట్ చూపించడం లేదు.

    Also Read: వైరల్ అవుతోన్న ‘రమ్యకృష్ణ -సత్యరాజ్’ వీడియో !

    పేరుకు ఇవి చిన్న సినిమాలు అయినా.. పెద్ద సినిమాల కంటే కూడా టెక్కు చూపిస్తున్నాయి. ఎప్పుడో రిలీజ్ అవాల్సిన సినిమాలు… పైగా ప్రసుతం థియేటర్ల ఓపెనింగ్ పై ఇంకా క్లారిటీ లేదు, ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినా గతంలో వచ్చినట్లు జనం వస్తారనే గ్యారంటీ కూడా లేదు. అసలు చిన్న సినిమాలకు ఎలాగూ స్టార్స్ కూడా ఉండరు. మరీ ఏ నమ్మకంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఓటిటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించడంలేదో వారికే తెలియాలి. మరో పక్క ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిల్మ్ లు చేసే ప్లాన్ లో ఉన్నారు.

    Also Read: ప్లాప్ హీరోకి బంపర్ ఆఫర్ !

    అలాగే అల్లు అరవింద్ కూడా తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా మంది దర్శకులతో ప్లాన్ చేశాడు. రేపు ఇవన్నీ డిజిటల ప్లాట్ ఫామ్స్ లోకి రిలీజ్ అయితే… అప్పుడు చిన్న సినిమాలను అమ్ముదాం అనుకున్నా… ఎవ్వరూ కొనేవారు ఉండరు. అందుకే చిన్న సినిమాలను డిమాండ్ ఉన్నపుడే ఓటిటీలో రిలీజ్ చేసుకోవడమే బెటర్. మరి చిన్న నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడితే వారికే మంచింది.