క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీట్వంటీ ఐపీఎల్ ఈ రోజు గ్రాండ్ గా మొదలైంది. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల రీత్యా.. ఈ సారి ఐపీఎల్ మ్యాచులు అన్ని అరబ్ కంట్రీస్ లో జరుగుతున్నాయి. అయినా మ్యాచ్ ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
Also Read: ఐపీఎల్ స్పెషల్… ఏ రికార్డు.. ఎవరిదో తెలుసా..
ముఖ్యంగా ఈ రోజు మోస్ట్ అవైటెడ్ మ్యాచ్.. చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య మొదలు కానున్న పోరు కోసం సామాన్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ బడా స్టార్స్ కే బాద్షా అయిన షారుఖ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట.
కాగా ఈ బాలీవుడ్ బాద్షా ఇరు జట్ల కెప్టెన్స్ మహేంద్ర సింగ్ ధోనికి అలాగే రోహిత్ శర్మతో సహా మిగిలిన ఇతర జట్టు సభ్యులకు కూడా గుడ్ లక్ చెబుతూ.. ఆరడుగుల దూరం నుంచి హగ్ ఇస్తున్నానంటూ.. ఆల్ ది బెస్ట్ తెలిపారు. మొత్తానికి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల పై షారుఖ్ ఖాన్ తన శైలిలో సెటైర్ వేసి నెటిజన్లను ఆకట్టుకున్నాడు.
Also Read: ఐపీఎల్13 తొలి రోజు ఎలా ఉంటుందంటే…
ఏమైనా బాలీవుడ్ లో బాద్షాగా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్, ఆ మధ్య జీరోతో ప్రేక్షకులముందుకు వచ్చినా విజయం వరించలేదు. ఇక షారుఖ్ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త రాకేష్ శర్మ బయోపిక్ లో నటించాల్సి ఉన్నా.. కొన్ని అనివార్యకారణాల వల్ల షారుక్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని తెలుస్తోంది.