https://oktelugu.com/

Telangana Rains: వానలు వచ్చేవి అప్పుడే.. మరో 4 రోజులు హైఅలెర్ట్

Telangana Rains: నైరుతి రుతుపవనాలు రాష్ర్టంలోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వానలు పడితే వ్యవసాయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఈసారి ముందే వర్షాలు వస్తాయని చెప్పినా ఇంకా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇంకా నాలుగు రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నైతుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని అధికారులు ఇప్పటికే తెలియజేశారు. దీంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2022 / 11:03 AM IST
    Follow us on

    Telangana Rains: నైరుతి రుతుపవనాలు రాష్ర్టంలోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వానలు పడితే వ్యవసాయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఈసారి ముందే వర్షాలు వస్తాయని చెప్పినా ఇంకా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇంకా నాలుగు రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

    Telangana Rains

    నైతుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని అధికారులు ఇప్పటికే తెలియజేశారు. దీంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా రాష్ట్రంలోకి రానున్నాయి. ఇంకా నాలుగు రోజులు ఎండలు ఇలాగే ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతున్నాయి. 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల ధాటికి కుదేలవుతున్నారు.

    Also Read: YSR Veterinary Ambulance Services: ప్రారంభించిన పదిరోజులకే.. మూలకు చేరిన పశువైద్య సంచార వాహనాలు

    సాధారణంగా రోహిణిలోనే వర్షాలు ఆగమనం ఉంటుంది. కానీ ఈ సారి ఇంకా కొంచెం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాగల నాలుగు రోజులు ఎండల దాడి కొనసాగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వానలు పడతాయని కూడా తెలియజేస్తోంది.

    Telangana Rains

    జూన్ 8 నాటికి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. వీటి ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెదురుముదురు వానలు పడతాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేందుకు సహకరించాల్సిందని రైతులు ఆశ పడుతున్నారు. మొత్తానికి వాతావరణ శాఖ సూచించిన అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ర్టవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

    Also Read:Pawan Kalyan- Nagababu: అమరావతిలో పవన్ కళ్యాణ్.. ఉత్తరాంధ్రలో నాగబాబు.. అసలు టార్గెట్ ఏంటి?

    Recommended Videos:


    Tags