https://oktelugu.com/

Chiranjeevi : లూసిఫర్ సీక్వెల్ రెడీ అవుతుంది…మరి చిరంజీవి మళ్ళీ ట్రై చేస్తారా..?

ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కానీ కొందరికి మాత్రమే ఇక్కడ సక్సెస్ లు వరిస్తాయి. మరికొందరు ఫ్లాపులు మూటగట్టుకొని ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 12:03 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi :  మలయాళం సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ కి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. నటుడిగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయన హీరోగా కూడా తనదైన రీతిలో స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ‘లూసిఫర్ ‘ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎల్ 2 ఎంపురన్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఇక దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగులో ఆశించిన మేరకు విజయం సాధించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తుంది. మరి చిరంజీవి ఈ సీక్వెల్ సినిమాలో నటిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇప్పటికే లూసీఫర్ సీక్వెల్ కి సంబంధించిన షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయితే చిరంజీవి మరోసారి ఈ సినిమా మీద కన్నేసే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో చేసిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. కారణం ఏంటంటే లూసిఫర్ సినిమాని అందరూ తెలుగు డబ్ వెర్షన్ చూసేసారు. మళ్ళీ అదే సినిమాని గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేయడం వల్ల వచ్చేది ఏమీ లేదని అందరూ చెప్పినప్పటికి చిరంజీవి వినకుండా ఆ సినిమాని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు.

    ఇక మొత్తానికైతే చిరంజీవి లాంటి స్టార్ హీరో అలాంటి ఒక రీమేక్ చేసి భారీ దెబ్బ తినడం అనేది నిజంగా చాలా బ్యాడ్ విషయమనే చెప్పాలి. నిజానికి చిరంజీవి ఇంతకు ముందు చాలా రీమేక్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. అయినప్పటికి ఈ రీమేక్ సినిమా మాత్రం దెబ్బ కొట్టడంతో ఆయన ఇమేజ్ కొంతవరకు డ్యామేజ్ అయింది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమా పైన మరోసారి ఫోకస్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…

    ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి లూసిఫర్ చేసి ఫ్లాప్ అయిన చిరంజీవి ఈ సీక్వెల్ సినిమా చేసి సక్సెస్ సాధించి ఆ సినిమాతో పోయిన పరువును ఈ సినిమాతో తిరిగి తెచ్చుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…