https://oktelugu.com/

Venky Atluri : వెంకీ అట్లూరి లో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడా..? అని షాక్ అవుతున్న మన స్టార్ హీరోలు…

సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మంచి దర్శకత్వ పరిజ్ఞానం అయితే ఉంటుంది. కానీ వాళ్లకి సరైన అవకాశాలు రావడం లేదు. ఇక వాళ్ళు చేసే సినిమాలు సక్సెస్ అవుతాయా లేదా అనే జడ్జ్ చేసే విషయంలో కానీ కొద్ది వరకు రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ ఏంటి అనేది తెలుసుకొని తర్వాత సినిమాల్లో వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం వాళ్లకు మంచి లైఫ్ అయితే ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 12:10 PM IST

    Venky Atluri

    Follow us on

    Venky Atluri : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి… ఆయన తీసిన తొలిప్రేమ సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో సెన్సిటివ్ ఇష్యూస్ ని చాలా బాగా డీల్ చేశారనే ఉద్దేశంతోనే అతనికి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. మరి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను, నితిన్ తో చేసిన రంగ్ దే సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చే హీరోలు కరువయ్యారు. దాంతో ఆయన తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్ ను హీరోగా పెట్టి చేసిన ‘సార్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటూ మరోసారి మలయాళం సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ ను హీరోగా పెట్టి చేసిన ‘లక్కీ భాస్కర్’ సినిమా కూడా రీసెంట్ గా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.

    ఇక దానికి తోడుగా ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుంటాడు. అయితే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఈ స్టార్ డైరెక్టర్ ని పక్కన పెట్టడం వల్ల ఆయన మిగతా భాషల్లో ఉన్న హీరోలతో సినిమాలను చేసి మంచి విజయాన్ని అందుకుంటున్నాడు.

    నిజానికి వెంకీ అట్లూరి అంటే ఇంతకుముందు కమర్షియల్ సినిమా లాగే అతను సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ ఒకసారిగా రూట్ మార్చి డిఫరెంట్ సినిమాలను ఎంచుకొని సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఈయనకి ఇప్పటికైనా తెలుగులో స్టార్ హీరోలు అవకాశం ఇస్తారా లేదా అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

    ఇక మరి కొంత మంది మాత్రం వెంకీ అట్లూరి లో ఇంత మంచి టాలెంట్ ఉందా ఎప్పుడు కనిపించలేదు అంటూ అతన్ని పొగుడుతూనే ఆయనకి అవకాశాలను ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి మరి వెంకీ అట్లూరి తర్వాత చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.