https://oktelugu.com/

Rajamouli: ప్రపంచం మొత్తం తిరుగుతున్న రాజమౌళి…ఇక మహేష్ బాబు కి బ్యాండ్ బాజా బారాతేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడి గా కొనసాగడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా తనదైన రీతిలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక దానికోసమే విపరీతంగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 11:32 AM IST

    Mahesh-Rajamouli Movie

    Follow us on

    Rajamouli: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్టోరీ కంప్లీట్ అవ్వగా దానికి సంబంధించిన లొకేషన్స్ ను వెతికే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని తద్వారా పాన్ వరల్డ్ లో తన పేరు మారుమ్రోగిపోవాలని రాజమౌళి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఆయన ప్రపంచం మొత్తాన్ని తిరిగేస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆయనకు సంబంధించిన లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని వెతికి పట్టుకొని ఎలాగైనా సరే అందులో షూట్ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ యాత్ర చేస్తున్నాడనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పిక్ చూస్తుంటే రాజమౌళి ఏమి ఆలోచించకుండా పరిగెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది.

    అయితే ఆ పిక్ కెన్యా లో దిగినట్టుగా చేశాడు. కాబట్టి ప్రస్తుతం ఆయన ఇది అది అనే తేడా లేకుండా అన్ని ఏరియాలను చుట్టేస్తున్నాడు. ఇక ఇదంతా చూస్తుంటే మహేష్ బాబును భారీగా పరిగెత్తించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చాలా సాఫ్ట్ గా ఉండే సినిమాలనే చేసుకుంటూ నిదానంగా వెళ్ళాడు.

    కానీ రాజమౌళి మాత్రం మహేష్ బాబు ను విపరీతంగా కష్టపెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న రాజమౌళి భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక తమదైన రీతిలో ఈ సినిమా చేయగలిగితే మాత్రం రాజమౌళి తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా తనను మించిన దర్శకుడు ఎవరు లేరు అనేంతల క్రేజ్ నైతే సంపాదించుకుంటాడు.

    ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా పాన్ డైరెక్టర్ లో ఆయన మించిన దర్శకులు ఎవరి లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు…