Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన, దర్పం అంతలా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ సంవత్సరం ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండూ సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ల హిట్ లను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన బాలకృష్ణ తాజాగా దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ థియేటర్లలోకి వచ్చి హిట్ రేసుతో దూసుకొని పోతుంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య గురించి మరో టాక్ తెగ వైరల్ అవుతుంది.
మోక్షజ్ఞ ఎంట్రీ..
మనుషులకు కోరికలు ఉండడం కామన్. అదే విధంగా నందమూరి నటసింహానికి కూడా ఓ మూడు కోరికలు ఉన్నాయట. ఆ మూడు కోరికలను వచ్చే ఏడాది ఎలాగైనా తీర్చుకోవాలి అని తపన పడుతున్నారట. అందులో మొదటిది వచ్చే ఏడాది తన కుమారుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని పలుసార్లు పలు సందర్భాలలో తెలియజేశారు. ఇలా వచ్చే ఎడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పక్క ఉండబోతుందని తెలుస్తోంది.
దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య?
మొదటి కోరికి కొడుకు గురించి అయితే రెండో కోరిక ఆదిత్య సినిమా గురించి. బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ చిత్రాన్ని చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నారు. అయితే ఆ కోరికను కూడా వచ్చే ఏడాది పూర్తి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. మరి రెండు కోరికలు బాగున్నా.. మూడో కోరిక మాత్రం కాస్త భిన్నంగానే ఉంది.. ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నారట బాలయ్య. అందుకే వచ్చే సంవత్సరం ఒక సినిమాకైనా దర్శకుడుగా పని చేయాలని కోరుకుంటున్నారట. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో భాగంగా తాను ఒక కథను సిద్ధం చేసుకున్నానని త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ వెల్లడించారు. బహుశా ఈ సినిమాకు బాలకృష్ణ దర్శకుడుగా పని చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ మూడు కోరికలను ఎలాగైనా వచ్చే సంవత్సరం తీర్చుకోవాలి అనుకుంటున్నారట బాలయ్య.