Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ గా లాంచ్ చేశారు. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మంది కంటెస్టెంట్స్ తో షో ప్రారంభం కాలేదు. ప్రతి సీజన్లో 19 నుండి 21 మందితో లాంచింగ్ ఎపిసోడ్ ఉండేది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఐదు వారాల అనంతరం అంబటి అర్జున్, పూజ మూర్తి, నయని పావని, అశ్విని, భోలే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. దీంతో హౌస్లో మరలా 14 మంది అయ్యారు. నయని పావని ఆరవ వారం, పూజ మూర్తి ఏడవ వారం ఎలిమినేట్ అయ్యారు. రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం హౌస్లో… శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, ప్రియాంక, రతిక రోజ్, సందీప్, గౌతమ్, భోలే, అంబటి అర్జున్, అశ్విని ఉన్నారు. మరి వీరిలో టాప్ ఫైవ్ లో ఉండేది ఎవరు? ఫైనల్ కి వెళ్ళేది ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రముఖ మీడియా సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆర్మాక్స్ సంస్థ అక్టోబర్ 14 వరకు సేకరించిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తెలియజేసింది.
ఆ సర్వే ప్రకారం… శివాజీ టాప్ లో ఉన్నారు. 90కి పైగా సినిమాల్లో విలక్షణ రోల్స్ చేసిన శివాజీ సీనియర్ నటుల్లో ఒకరు. మొదటి రోజు నుండి శివాజీ కూల్ గేమ్ ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్, యావర్ వంటి ఫేమ్ లేని కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా నిలుస్తూ అతడు గేమ్ ఆడటం ప్లస్ అయ్యింది. దీంతో శివాజీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఆర్మాక్స్ సర్వే ప్రకారం నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో అడుగుపెట్టిన ప్రశాంత్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉంది.
మొదట్లో ప్రశాంత్ తడబడ్డాడు. అమర్, రతిక అతడు సింపథీ గేమ్ ఆడుతున్నాడని ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా అతడి ఇమేజ్ తగ్గలేదు. పైగా పవర్ అస్త్ర గెలవడంతో పాటు హౌస్ ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇక మూడు స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. సీరియల్ నటుడిగా అమర్ దీప్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది కలిసొస్తుంది. గేమ్ పరంగా అతడు తన మార్క్ చూపలేదు. ఇక నాలుగో స్థానంలో ప్రియాంక ఉంది. ఐదో స్థానంలో అంబటి అర్జున్ ఉన్నాడు.
టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నఒకే ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ అంబటి అర్జున్. ఇతడు కొని టాస్క్ లలో సత్తా చాటాడు. మూడో హౌస్ కెప్టెన్ అయ్యాడు. కాబట్టి ఇప్పటి వరకు శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, అంబటి అర్జున్ టాప్ 5లో ఉన్నారు.