https://oktelugu.com/

Master Movie: మాస్టర్ సినిమాకు చిరంజీవి డైరెక్టర్ ను ఎందుకు మార్చారో తెలుసా?

చిరు హీరోగా వచ్చిన చాలా సినిమాలు విజయాలను సొంతం చేసుకోవడమే కాదు.. సినిమా అంటే ఎలా ఉండాలో ఓ ట్రెండ్ ను సృష్టించి ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 18, 2023 / 05:38 PM IST

    Master Movie

    Follow us on

    Master Movie: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీకి పెద్దన్న అంటారు. ఆయన నటించే సినిమాలతోనే కాదు ఆయన మంచి మనుసుకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న హీరో చిరు. మనవరాలు వచ్చినా కూడా నటనలో ఏ మాత్రం తీసిపోని నటుడు చిరు. వృద్దాప్య ఛాయలు వస్తున్నా..పాత్రల్లో యువ నటుడిలా జీవించేస్తారు. ఈయన నటించే సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ లనే సొంతం చేసుకుంటాయి. ఎందుకంటే ఆయన చిరంజీవి.

    చిరు హీరోగా వచ్చిన చాలా సినిమాలు విజయాలను సొంతం చేసుకోవడమే కాదు.. సినిమా అంటే ఎలా ఉండాలో ఓ ట్రెండ్ ను సృష్టించి ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేశారు. వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్ లను సొంతం చేసుకొని కొత్త రికార్డును సృష్టించారు చిరు. ఇప్పటి వరకు కూడా ఈ రికార్డును ఏ హీరో బ్రేక్ చేయలేకపోయారు. అయినా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానంలో నిలిచిపోతుంది మాస్టర్ సినిమా. అప్పటి వరకు ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న చిరుకు సూపర్ డూపర్ హిట్ సినిమా రావడంతో ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా కంటే ముందు హిట్లర్ సినిమా వచ్చినా కూడా మాస్టర్ సినిమాతోనే మంచి క్రేజ్ తో పాటు, స్టార్ హోదా వచ్చేసింది.

    అయితే ఈ సినిమాకు చిరంజీవి డైరెక్టర్ ను మార్చారు. దీనికి కారణం ఏంటబ్బా అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొదటగా మాస్టర్ సినిమాకి రవి రాజా పినిశెట్టి ని డైరెక్టర్ గా తీసుకుందామని చిరంజీవి అనుకున్నారంట కానీ అప్పటికే ఆయన కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి భాషా సినిమాని డైరెక్షన్ చేసిన సురేష్ కృష్ణని డైరెక్టర్ గా తీసుకున్నారు. అంతకు ముందు ఈయన తీసిన చాలా సినిమాలు హిట్ లను అందుకున్నాయి. అదే టైమ్ లో మాస్టర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయి చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గలేదు అని ప్రూవ్ చేసిన సినిమాగా నిలిచింది.