కమలంతో పొత్తుకు చంద్రబాబు ఆరాటం

కేంద్రం దూకుడును బట్టి చూస్తుంటే దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నట్లే అర్థమవుతోంది. ఆ దిశగానే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో అయితే రాజకీయాలు జమిలి టార్గెట్‌గా సాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు మీద పడింది. జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి..? ఒంటరిగా ముందుకెళ్తారా..? ఏ పార్టీతోనైనా జత కడుతారా..? ఈ చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. Also Read: సీమ రక్త చరిత్రలోనే ఆసక్తికర సీన్? గత ఎన్నికల్లో ఒంటరిగా […]

Written By: Srinivas, Updated On : December 29, 2020 11:46 am
Follow us on


కేంద్రం దూకుడును బట్టి చూస్తుంటే దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నట్లే అర్థమవుతోంది. ఆ దిశగానే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో అయితే రాజకీయాలు జమిలి టార్గెట్‌గా సాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు మీద పడింది. జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి..? ఒంటరిగా ముందుకెళ్తారా..? ఏ పార్టీతోనైనా జత కడుతారా..? ఈ చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

Also Read: సీమ రక్త చరిత్రలోనే ఆసక్తికర సీన్?

గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. అందుకే.. ఈసారి చంద్రబాబు జట్టుగానే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు గత కొన్ని దఫాలుగా ఒకేసారి జరుగుతున్నాయి. ఇది ఏపీకి కొత్తేమీ కాదు. కానీ.. ఈసారి ఏడాది ముందే ఎన్నికలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా వెళ్లేకంటే కూటమితోనే వెళ్లడం మంచిదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కానీ.. బీజేపీతో కలిసి వెళ్లాలన్నదే చంద్రబాబు ఆలోచనట.

ఇందుకు త్వరలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. 20 నెలలుగా చంద్రబాబు ఢిల్లీ గడప తొక్కలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో వైరం పెట్టుకుని కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. అది ఫలితాలనివ్వకపోవడంతో ఈసారి కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నారు. కానీ.. బీజేపీతో కలసి తాను నడవాలనుకుంటున్నా అందుకు రాష్ట్రంలో ఆ పార్టీ అంగీకరించే పరిస్థితి కన్పించడం లేదు.ఇప్పటికే ఆయనతో పొత్తును బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యతిరేకిస్తున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..!

ఇక రాష్ట్రంలో వర్కవుట్‌ అయ్యే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు దృష్టి హస్తినా వైపు మళ్లిందట. ఢిల్లీ స్థాయి లీడర్లతో మంతనాలు జరిపేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుత కేంద్రమంత్రి, బీజేపీలో కీలక నేతగా ఉన్న ఒకరితో చంద్రబాబు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. సరైన సమయం చూసుకొని ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి వెళితేనే జగన్‌ను దెబ్బకొడతామన్న అభిప్రాయంతో ఉన్న చంద్రబాబు ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక బీజేపీ నేత కూడా చంద్రబాబుకు, బీజేపీ పెద్దలకు మధ్య సయోధ్య చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఏదో ఒక పార్టీతో జతకట్టకుంటే బయటపడే పరిస్థితి లేదని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్