Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ సూర్యకి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ కి సంబంధించిన వేరియేషన్స్ ను చూపిస్తూ వస్తున్నాడు. ఇక ఒక మూస ధోరణి లో యాక్టింగ్ చేయడం అంటే తనకు నచ్చదు. అందుకే సినిమా సినిమాకి డిఫరెన్స్ ను చూపిస్తూ తనలోని నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటు వస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య శివ డైరెక్షన్ లో ‘కంగువ’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
Also Read: HBD Balayya: బాలయ్య.. నీకుసాటి ఎవరూ రారయ్యా..
ఇక మొత్తానికైతే సూర్య కంగువ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో సూర్య చాలా యంగ్ గా కనిపించడమే కాకుండా పుష్ప సినిమాలో మాదిరిగా ఉన్నాడు అంటూ చాలామంది కామెంట్లైతే చేస్తున్నారు.
Also Read: NBK 109 ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: దయలేని అసురుడు వీడు… బాలయ్య లుక్ కేక!
అయితే పుష్ప మాదిరిగానే ఈ సినిమా కూడా ఉండబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సూర్య ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు అనే విషయానికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియనప్పటికీ ఆయన గెటప్ మాత్రం అల్లు అర్జున్ పుష్ప సినిమా మాదిరిగానే ఉంది అంటూ కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు సూర్య, ఇటు కార్తీక్ సుబ్బరాజు ఇద్దరు కూడా మంచి విజయాన్ని సాధించాలని చూస్తున్నారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More