Homeఎంటర్టైన్మెంట్Rajamouli world number one director debate: రాజమౌళి ఎన్ని చేసిన వరల్డ్ నెంబర్ వన్...

Rajamouli world number one director debate: రాజమౌళి ఎన్ని చేసిన వరల్డ్ నెంబర్ వన్ డైరెక్టర్ కాలేడా.? కారణమేంటంటే..?

Rajamouli world number one director debate: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేయడం స్టార్ట్ చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో అప్పటినుంచి ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో పాన్ ఇండియా సక్సెస్ లను సాధిస్తున్నాడు. ప్రస్తుతం వారణాసి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాని 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో ఉన్నాడు. ఇక రాజమౌళి ఎంత చేసిన కూడా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ రేంజ్ ను టచ్ చేయలేడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆయన చేసిన అవతార్ సినిమా 24 వేల కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. మన సినిమా కలెక్షన్స్ ఇంకా రెండు వేల కోట్ల దగ్గరే ఆగిపోయింది… ఇక రాజమౌళి ఆ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టాలి అంటే ఇంకెన్ని సినిమాలు చేయాలి?

ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ను సినిమా మీద కేటాయించాలి అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి మహాభారతం సినిమా చేసిన కూడా అంత కలెక్షన్స్ రావేమో అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నాడు.

వారణాసి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనే విషయం పక్కన పెడితే రాజమౌళి హాలీవుడ్ స్టాండర్డ్ లో సినిమాలను చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సైతం అతని సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే హాలీవుడ్ మేకర్స్ సైతం రాజమౌళిని గుర్తించారు. తను హైలీ టాలెంటెడ్ అనే విషయాన్ని హాలీవుడ్ దర్శకులు గమనించారు.

దాంతో అతని సినిమాలకు వాళ్లు కూడా ఎంకరేజ్ మెంట్ అందిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం హాలీవుడ్ డైరెక్టర్ల రేంజ్ లో సినిమాలు చేసి ముందుకు సాగాలి అనుకోవడం ఒక వంతుకు కరెక్టే అయిన కూడా అది జరుగుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular