https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి ఎందుకు ఆ సినిమాను సూపర్ హిట్ గా నిలుపలేకపోయారు..?

ఈ సినిమా రాజమౌళి కెరియర్ లో కొంతవరకు డిస్ట్రిబ్యూటర్లను నష్టపరిచిందనే చెప్పాలి. ఇక కంటెంట్ పరంగా చూసుకుంటే సినిమా అయితే చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 8, 2024 / 05:45 PM IST

    Why Rajamouli could not keep that movie as a super hit

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక అలాగే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు.

    ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన సై సినిమా స్పోర్ట్స్ బ్లాక్ డ్రాప్ లో తెరకెక్కినప్పటికీ ఆ సినిమాని ఆయన భారీ హిట్టు గా మల్చడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అయితే ఈ సినిమా అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ల కి కొంత వరకు నష్టాలను మిగిల్చిందనే వార్తలు కూడా వచ్చాయి. నిజానికి ఈ సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉంటూ ప్రేక్షకుడిని అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తు ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవ్వలేదో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకొని అంత తక్కువ కలెక్షన్స్ ను ఎందుకు రాబతట్టింది అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కానీ విషయం అనే చెప్పాలి.

    ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన గిరి ఈ సినిమా వల్ల కొంతవరకు నష్టపోయానని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా రాజమౌళి కెరియర్ లో కొంతవరకు డిస్ట్రిబ్యూటర్లను నష్టపరిచిందనే చెప్పాలి. ఇక కంటెంట్ పరంగా చూసుకుంటే సినిమా అయితే చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుంది. ఇక ఈ సినిమాతో రగ్బీ అనే ఒక గేమ్ కూడా ఉంటుందనే విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

    ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే పాన్ వరల్డ్ సినిమా మీదనే తను ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ లోనే దిగ్గజ దర్శకులందరికీ రాజమౌళి షాక్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక రాజమౌళి ఇప్పటికే ఈ సినిమా లొకేషన్స్ వేట లో ఉన్నట్టుగా తెలుస్తుంది…